ఆరోగ్యంపై కేకుదెబ్బ
గుంటూరు మెడికల్: పండుగ, పుట్టినరోజు, పెళ్లిరోజు, వార్షికోత్సవం ఇలా సందర్భం ఏదైనా కేక్ కట్‌చేయటం ఇప్పుడు ఆనవాయితీగా మారింది. ప్రతి శుభ కార్యానికీ స్వీట్ బాక్స్ తీసుకెళ్ళడాన్ని గమనిస్తూనే ఉన్నాం. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో స్వీట్లు, కేక్‌లు తయారు చేసే షాపులు ఉన్నాయి. వీటిల్లో నిత్యం లక్షలాది రూపాయల్లో వ్యాపారం జరుగుతోంది. కొన్ని రకాల బ్రాండ్‌ల పేరుతో ఉన్న షాపుల్లో గుంటూరు నగరం నుంచి దేశవిదేశాలకు స్వీట్లు ఎగుమతి అవుతున్నాయి. అయితే కేక్‌లు, స్వీట్లు కొనుగోలు చేసే సమయంలో ఒకింత జాగ్రత్త వహించి, పదార్థాలను పరిశీలించాలి. లేకపోతే ఆనందంగా తినే ఆహార పదార్థాలే విషంగా మారతాయి. అనారోగ్యాన్ని బహుమతిగా ఇస్తాయి.
క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకు అమ్మకాలు
డిసెంబర్ ప్రారంభం నుంచి ప్రతిచోటా సెమీ క్రిస్మస్‌లు జరుగుతూనే ఉంటాయి. రోజూ కేక్ కటింగ్‌లు ఉంటాయి. డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున, జనవరి 1 నూతన సంవత్సరం రోజున, సంక్రాంతి రోజున స్వీట్లు, కేక్‌ల అమ్మకాలు భారీగా ఉంటాయి. ఏడాది మొత్తంలో జరిగే అమ్మకాల్లో వచ్చే లాభాల కంటే కేవలం క్రిస్మస్, జనవరి ఫస్ట్ రోజున వచ్చే ఆదాయమే అనేక రెట్లు ఎక్కువగా ఉంటుంది. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో కేక్‌లు కట్‌చేసి, స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకుంటారు. రోడ్లుపైన బల్లలు పెట్టి, పందిళ్లు వేసి ఒక్కరోజులోనే లక్షలాది రూపాయల వ్యాపారం చేస్తారు. అయితే వ్యాపారుల్లో చాలా మంది స్వలాభం కోసం వినియోగదారుల ఆరోగ్యం గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం నిషేధించిన రంగులను కేక్‌లు, స్వీట్ల తయారీలో వినియోగిస్తున్నారు.
నిబంధనలు పాటించరు
జిల్లాలో బేకరీ షాపుల నిర్వాహకులు, స్వీట్లు షాపుల నిర్వాహకులు ఎక్కువ మంది ఫుడ్ లైసెన్స్‌లు తీసుకోకుండా అమ్మకాలు చేస్తున్నారు. రొట్టె, కేక్, స్వీట్ల కవర్లు, బాక్సులపై వాటి తయారీ తేదీ, గడువు తీరే తేదీ కచ్చితంగా ముద్రించాలి. లేకుంటే చట్టరీత్యా నేరమే. స్వీట్లు, కేక్‌లు కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా చూడాలి. చాలామంది కేక్‌లు, స్వీట్ల తయారీలో అనుమతి లేని రంగులను వాడుతున్నారని, కేక్‌లపై పేర్లు రాసేందుకు వీటిని ఉపయోగిస్తున్నారని ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు హెచ్చరిస్తున్నారు.
అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవద్దు కేక్ కొనేముందు గమనించాలి స్వీట్లనూ పరిశీలించి తీసుకోవాలి అనుమతి లేకుండా వ్యాపారం చేస్తే జైలుకే అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ నూతలపాటి పూర్ణచంద్రరావు
నాణ్యత లేకుంటే
ఫిర్యాదు చేయండి
94403 79755
Comments
Please login to add a commentAdd a comment