సాక్షి ప్రతినిధి, వరంగల్: గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 13వ తేదీ నుంచి సార్వత్రిక ఎన్నికల మలివిడత ప్రచారంలో భాగంగా ఉమ్మడి వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు కేసీఆర్ ప్రచార సభల షెడ్యూల్‌ను శనివారం రాత్రి పార్టీ వర్గాలు విడుదల చేశాయి. ఈ నెల 13 నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్న కేసీఆర్ 28వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. ఉమ్మడి వరంగల్‌లోని ఎనిమిది నియోజకవర్గాల్లో ప్రచారసభలు నిర్వహించనున్నారు.
ప్రచారానికి చివరి రోజైన 28న వరంగల్‌లోనే ముగించనున్నారు. అక్టోబర్ 16న జనగామ నియోజకవర్గ కేంద్రంలో తొలి ప్రచార సభ నిర్వహించిన సీఎం.. ఆ తర్వాత వర్ధన్నపేట, మహబూబాబాద్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. మలి విడత ప్రచారంలో భాగంగా ఈ నెల 13 నుంచి 28 వరకు ఉమ్మడి వరంగల్‌లోని ఎనిమిది నియోజకవర్గాల్లో సభలు నిర్వహించనున్నారు. 13న నర్సంపేటలో, 14న పాలకుర్తిలో, 18 చేర్యాల(జనగామ)లో, 20న స్టేషన్ ఘన్‌పూర్, 21న డోర్నకల్, 24న ములుగు, భూపాలపల్లి, 28న వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో నిర్వహించే సభల్లో కేసీఆర్ పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment