గూడ్స్ ఘటనతో పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు
కాజీపేట రూరల్ : పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ –రామగుండం మధ్య మంగళవారం పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ఘటనతో బుధవారం కాజీపేట జంక్షన్ మీదుగా ఢిల్లీ–సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు రద్దు, దారి మళ్లించి నడిపించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
యశ్వంత్‌పూర్– ముజఫర్‌పూర్ (06229) ఎక్స్‌ప్రెస్, కాచిగూడ–నాగర్‌సోల్ (17661) ఎక్స్‌ప్రెస్, కాచిగూడ–కరీంనగర్ (07793) ఎక్స్‌ప్రెస్, కరీంనగర్–కాచిగూడ (07794) ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–రామేశ్వరం (07695) ఎక్స్‌ప్రెస్, రామేశ్వరం–సికింద్రాబాద్ (07696) సికింద్రాబాద్–తిరుపతి (07041) ఎక్స్‌ప్రెస్, తిరుపతి–సికింద్రాబాద్ (07042) ఎక్స్‌ప్రెస్, ఆదిలాబాద్–నాందేడ్ (17409) ఎక్స్‌ప్రెస్, నాందేడ్–ఆదిలాబాద్ (07595) ఎక్స్‌ప్రెస్, సిర్‌పూర్‌కాగజ్‌నగర్–బీదర్ (17012) ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్–సిర్‌పూర్‌కాగజ్‌నగర్ (17011) ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–సిర్‌పూర్‌కాగజ్‌నగర్ (12757) ఎక్స్‌ప్రెస్, నాగ్‌పూర్–సికింద్రాబాద్ (20101) ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–నాగ్‌పూర్ (12758) ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశారు.
రీషెడ్యూల్ వివరాలు
హైదరాబాద్–న్యూఢిల్లీ (12723) ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–దానాపూర్ (12791) ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–నిజాముద్దీన్ (12437) ఎక్స్‌ప్రెస్, తిరుపతి–నిజాముద్దీన్ (12707) ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–రక్సోల్ (07007) ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్–ముజఫర్‌పూర్ (06229) ఎక్స్‌ప్రెస్‌లు రీషెడ్యూల్‌తో నడుస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ప్యాసింజర్ రైళ్లు రద్దు
గూడ్స్ ఘటనతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్యాసింజర్ రైళ్లన్నీ రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
పలు రైళ్ల దారి మళ్లింపు
గోరఖ్‌పూర్–యశ్వంత్‌పూర్ (15023) ఎక్స్‌ప్రెస్, వికారాబాద్, గుంతకల్‌మీదుగా, దర్బాంగా–సికింద్రాబాద్ (17008) ఎక్స్‌ప్రెస్, నాగ్‌పూర్, ఆదిలాబాద్ మీదుగా, తిరుపతి–జమ్ముతావి (22705) ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ మీదుగా, బెంగళూర్–నిజాముద్దీన్ (22691) ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్, నిజామాబాద్ మీదుగా, దానాపూర్–సికింద్రాబాద్ (12792) ఎక్స్‌ప్రెస్, పర్లీ మీదుగా, నిజాముద్దీన్–సికింద్రాబాద్ (07032) ఎక్స్‌ప్రెస్, నిజామాబాద్ మీదుగా, న్యూఢిల్లీ–హైదరాబాద్ (12724) ఎక్స్‌ప్రెస్, నిజామాబాద్ మీదుగా, నిజాముద్దీన్–బెంగళూర్ (22692) ఎక్స్‌ప్రెస్, నిజామాబాద్ మీదుగా, నిజాముద్దీన్–హైదరాబాద్ (12722) ఎక్స్‌ప్రెస్, నాగ్‌పూర్, పర్లీ మీదుగా దారి మళ్లించి నడిపిస్తున్నట్లు తెలిపారు. కాగా, రైళ్ల రద్దు, దారి మళ్లింపు, రీషెడ్యూల్‌తో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
హెల్ప్‌లైన్ సెంటర్
కాజీపేట జంక్షన్‌లో రైల్వే అధికారులు హెల్ప్‌లైన్ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. రైళ్ల రాకపోకలు, ఆలస్యం, మళ్లింపు, రద్దు వివరాలను తెలుసుకునేందుకు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
నేడు దానాపూర్ రద్దు
సికింద్రాబాద్–దానాపూర్ (12791) ఎక్స్‌ప్రెస్ గు రువారం రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అ దేవిధంగా సిర్‌పూర్‌కాగజ్‌నగర్–సికింద్రాబాద్ భా గ్యనగర్ ఎక్స్‌ప్రెస్ గురువారం పెద్దపల్లి–సికింద్రాబాద్ మధ్య నడుస్తుందని అధికారులు తెలిపారు.
యథావిధిగే నడిచే అవకాశం
పెద్దపల్లి గూడ్స్ ఘటనకు సంబంధించి లైన్‌ను క్లియర్ చేసి గురువారం నుంచి యథావిధిగా రైళ్లను నడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రయాణికుల పడిగాపులు
కాజీపేట జంక్షన్‌లో హెల్ప్‌లైన్ సెంటర్
వరంగల్ మీదుగా వెళ్లే రద్దయిన రైళ్ల వివరాలు..
12577–భాగమతి ఎక్స్‌ప్రెస్, 12622–తమి ళనాడు, 12616–గ్రాండ్‌ట్రంక్(జీటీ), 126 55 నవజీవన్ సూపర్ ఫాస్ట్, 16318 హిమసాగర్, 17296 సంఘమిత్ర సూపర్‌ఫాస్ట్, 20806 ఏపీ ఎక్స్‌ప్రెస్, 12626 కేరళ ఎక్స్‌ప్రెస్, 03259 ఎస్‌ఎంవీటీ బెంగళూరు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, 22670 ఎర్నాకుళం సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, 22610 తిరున్వేలి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, 12670 గంగా కావేరి ఎక్స్‌ప్రెస్‌లు దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాగా, వరంగల్‌లో అధికారులు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment