దివ్యాంగులు సంకల్పసిద్ధులు | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగులు సంకల్పసిద్ధులు

Published Sat, Nov 23 2024 12:57 AM | Last Updated on Sat, Nov 23 2024 12:57 AM

దివ్య

దివ్యాంగులు సంకల్పసిద్ధులు

ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి

వరంగల్‌ స్పోర్ట్స్‌: దివ్యాంగులు సంకల్ప సిద్ధులు, వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే అనుకున్న రంగాల్లో రాణిస్తారని, ఆదిశగా అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈవేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి హాజరై వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్యతో కలిసి జెండా ఊపి పోటీలు ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దివ్యాంగుల సంక్షేమం కోసం చర్చిస్తామని, అందుకోసం సంబంధిత అధికారులు డీపీఆర్‌ సిద్ధం చేయాలని సూచించారు. ఎంపీ కావ్య మాట్లాడుతూ.. దివ్యాంగులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని, తాను రాజకీయాల్లోకి రాకముందు నుంచే దివ్యాంగుల కోసం అనేక చేయూత కార్యక్రమాలు చేపట్టానని గుర్తు చేశారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ వెంకట్‌రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, ఇన్‌చార్జ్‌ డీవైఎస్‌ఓ శ్రీమన్నారాయణ, పారా స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వద్దు

గ్రేటర్‌ కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే

వరంగల్‌ అర్బన్‌: నగరంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ పనులను మూడు నెలల్లో ప్రారంభమయ్యేలా నిర్దిష్ట ప్రణాళికల ద్వారా ముందుకు సాగాలని గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ డాక్టర్‌ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. శుక్రవారం వరంగల్‌ బల్దియా ప్రధాన కార్యాలయంలోని కమిషనర్‌ చాంబర్‌లో ఆయన ఇంజనీర్లతో సమావేశమయ్యారు. పట్టణ ప్రగతి, సీఎంఏ, జీఓ 65, జనరల్‌ ఫండ్‌ తదితర అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈసందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల శంకుస్థాపన చేసిన నేపథ్యంలో.. అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ పనులపై సీరియస్‌గా దృష్టి సారించాలన్నారు. ఆయా అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, పనుల్లో వేగం పెంచాలన్నారు. బల్దియా వ్యాప్తంగా 66 డివిజన్లలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకుని, ఆపనుల్లో వేగం పెంచి పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఎస్‌ఈ ప్రవీణ్‌ చంద్ర, ఈఈలు శ్రీనివాస్‌, సంతోశ్‌ బాబు, డీఈ శ్యాంమోహన్‌, ఏఈ సౌజన్య పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు

కార్యాచరణ రూపొందించాలి

వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

వరంగల్‌: మామునూరు ఎయిర్‌పోర్ట్‌, కాకతీయ మెగా టెక్స్‌టైల్స్‌ పార్కు, గ్రీన్‌ఫీల్డ్‌ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు పనులు చేపట్టేందుకు తగిన కార్యాచరణ రూపొందించాలని వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఆయా పనులపై శుక్రవారం నిర్వహించిన సమీక్షలో క లెక్టర్‌ మాట్లాడారు. సీఎం రేవంత్‌ నిధుల మంజూరు చేయడంతో ప నులపై ముందస్తు ప్రణాళిక తయారు చేయాలన్నారు. సమీక్షలో ఇన్‌చార్జ్‌ డీఆర్‌ఓ, ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, తహసీల్దార్లు నాగేశ్వర్‌రావు, ఇక్బాల్‌, రాజ్‌కుమార్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ జితేందర్‌రెడ్డి, ఇరిగేషన్‌ ఈఈ రామకృష్ణ, ఎన్‌హెచ్‌ అధికారి సల్మాన్‌రాజ్‌, జోనల్‌ మేనేజర్‌ రాములునాయక్‌ పాల్గొన్నారు.

26న ఇందిరా మహిళాశక్తి–ఉపాధి భరోసా

ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా ఈనెల 26న ఇందిరా మహిళాశక్తి–ఉపాధి భరోసా కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో నిర్వహించాలని వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద ఆదేశించారు. కలెక్టరేట్‌లో డీఆర్‌డీఓ కౌసల్యాదేవి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇందిరా మహిళాశక్తి, ఉపాధి భరోసాలో భాగంగా 2025 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల క్యాలెండర్‌ను రూపొందించాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, జిల్లా ప్రణాళిక అధికారి గోవిందరాజన్‌, ఎంపీడీఓలు, ఏపీఓలు, ఈసీలు తదితరులు పాల్గొన్నారు.

నేటి స్పెషల్‌ గ్రీవెన్స్‌ రద్దు

దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రతినెల నాలుగో శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించే స్పెషల్‌ గ్రీవెన్స్‌ను కలెక్టర్‌ ఆదేశాల మేరకు రద్దు చేసినట్లు వరంగల్‌ జిల్లా సంక్షేమ అధికారి రాజమణి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు గమనించి కలెక్టరేట్‌కు రావొద్దని ఆమె కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
దివ్యాంగులు సంకల్పసిద్ధులు1
1/2

దివ్యాంగులు సంకల్పసిద్ధులు

దివ్యాంగులు సంకల్పసిద్ధులు2
2/2

దివ్యాంగులు సంకల్పసిద్ధులు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement