వేర్వేరు కారణాలతో ముగ్గురి మృతి
నర్మెట : విషపురుగు కాటుతో మహిళ మృతిచెందిన సంఘటన కన్నెబోయినగూడెం బీక్యాతండాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు బీక్యాతండాకు చెందిన బానోత్ సుక్కమ్మ (49) ఓ రైతుకు పని నిమిత్తం కూలీకి వెళ్లింది. ఈక్రమంలో తనకు నీరసంగా, కళ్లు తిరుగుతున్నట్టుగా ఉందని తెలపడంతో వెంకిర్యాలలోని ఆర్‌ఎంపీకి వద్దకు తీసుకెళ్లారు. నోటి నుంచి నురుగు వస్తున్న ఆమెను పరీక్షించిన వైద్యుడు మృతిచెందినట్లు తెలిపాడు. కాగా భర్త సీతారాం ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ హిదాయత్‌అలీ తెలిపారు.
బావిలో పడి రైతు..
గూడూరు : ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ఓ రైతు మృతిచెందిన సంఘటన మండలంలోని అప్పరాజ్‌పల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గద్ద నరేష్ (38) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం పొలానికి నీరు పెట్టాలని బావి వద్దకు వెళ్లాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు రాత్రి బావి వద్దకు వెళ్లి చూశారు. బావి దగ్గర చెప్పులు, సెల్‌ఫోన్ మాత్రమే ఉన్నాయి. దీంతో వారు బావిలో దిగి చూడగా నరేష్ మృతదేహం కనిపించింది. ప్రమాదవశాత్తు జారి వ్యవసాయ బావిలో పడి మృతి చెందినట్లు నరేష్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.
పాముకాటుతో బాలుడు..
కాటారం : పాము కాటుకు గురైన బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన కాటారం మండల కేంద్రంలోని గారెపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒంగోలుకు చెందిన ఉప్పలపాటి సత్యనారాయణ కుమారుడు వేదాన్ష్ కార్తీకేయ(4) గారెపల్లిలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు. ఈ నెల 21న సాయంత్రం వేదాన్ష్ కార్తీకేయ ఇంటి ఎదుట ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో పాము కాటు వేయడంతో తీవ్ర అస్వస్థత గురికాగా కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎ ంకు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్సై మ్యాక అభినవ్ తెలిపారు. బాలుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment