పల్లెనుంచి పరిశోధనల వరకు..
నర్సంపేట : పల్లెటూరులో మొదలైన తన ప్రస్థానం విదేశాలకు పాకింది. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయినప్పటికీ మేనమామ, అమ్మమ్మ సహకారంతో చదువును కొనసాగించాడు. ఉన్నత చదువులు చదివి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చాడు. రాష్ట్ర స రిహద్దులు దాటి ఒడిశాలోని ప్రతిష్టాత్మక రూర్కెలా ఎన్‌ఐటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేసిన మర్కాల కార్తీ క్‌రెడ్డి గౌరవ డాక్టరేట్ పొందాడు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు అభినందనలు తెలిపారు.
విద్యాభ్యాసం...
నర్సంపేటకు చెందిన కార్తీక్‌రెడ్డి మేనమామ, అమ్మమ్మల సహకారంతో చదువును కొనసాగించాడు. కొమ్మాల ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి, నర్సంపేట ప్రభుత్వ బాలుర హైస్కూల్లో పదో తరగతి పూర్తి చేశాడు. అనంతరం ఉన్నత విద్య పూర్తి చేసి రూర్కెలా ఎన్‌ఐటీ నుంచి డాక్టరేట్ పొందాడు.
పరిశోధన ఇలా...
కార్తీక్‌రెడ్డి ఎన్‌ఐటీ రూర్కెలా ఈఈఈ విభాగానికి చెందిన ప్రొఫెసర్ వెంకటరమణ నాయక్, ప్రొఫెసర్ అనూప్‌కుమార్‌పాండా పర్యవేక్షణలో సోలా ర్ ఎనర్జీని గ్రిడ్‌కి అనుసంధానం చేస్తూ విద్యుత్ నాణ్యతను పెంచే విధంగా మల్టీఫంక్షనల్ సిస్టంను అభివృద్ధి చేశాడు. దీనికి గాను పీహెచ్‌డీ డాక్టరేట్ పట్టా అందుకున్నాడు. ఆయన చేసిన పరిశోధనా ఫలితాలు వివిధ అంతర్జాతీయ జర్నల్స్‌లో, సదస్సులలో ప్రచురించబడ్డాయి.
సింగపూర్‌లో ప్రదర్శనలు..
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐఈఈఈ సంస్థ గతేడాది సింగపూర్‌లో నిర్వహించిన ఐఈకాన్ అంతర్జాతీయ సదస్సులో కార్తీక్‌రెడ్డి తన పరిశోధన ఫలితా న్ని ప్రదర్శించడం జరిగింది. వివిధ దేశాల ప్రతిని ధులు పాల్గొని ఈ సదస్సులో మల్టీ ఫంక్షనల్ సోలా ర్ సిస్టం అడాప్టివ్ ఫిల్టరింగ్ కంట్రోల్ స్కిమ్స్ ద్వారా నియంత్రించబడుతూ చాలా సులువుగా సోలార్ ఎనర్జీని గ్రిడ్‌కి అనుసంధానం చేస్తూ విద్యు త్ నాణ్యతలో ఎదురయ్యే వివిధ సమస్యలను అధిరోహిస్తుందని వివరించాడు. అలాగే సోలార్ ఎనర్జీ అందుబాటులో లేని సమయంలోనూ విద్యుత్ నాణ్యతను పెంచడం ఈ సిస్టం ప్రత్యేకత అని తెలిపాడు. కాగా పోస్ట్ డాక్టరల్ ఫెలోగా అత్యున్నత పరిశోధన చేయడమే లక్ష్యమని పేర్కొన్నాడు.
అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా..
నర్సంపేటలోని బిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఈఈఈ విభాగంలో పదేళ్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేసి ప్రస్తుతం బెంగళూరులోని ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
అభినందనలు..
పీహెచ్‌డీ పట్టా పొందిన సందర్భంగా బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్‌రెడ్డి, ప్రెసిడెన్సీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నిస్సార్ అహ్మద్, అధ్యాపక బృందం, బంధువులు, సన్నిహితులు కార్తీక్‌రెడ్డిని అభినందించారు.
రూర్కెలా ఎన్‌ఐటీ నుంచి
డాక్టరేట్ పట్టా అందుకున్న కార్తీక్‌రెడ్డి
సింగపూర్ సదస్సులో సోలార్ విద్యుత్ నాణ్యతపై పరిశోధన పత్రం ప్రదర్శన
Comments
Please login to add a commentAdd a comment