ఇంటర్‌వర్సిటీ బ్యాడ్మింటన్‌ టోర్నీకి కేయూ జట్టు | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌వర్సిటీ బ్యాడ్మింటన్‌ టోర్నీకి కేయూ జట్టు

Published Tue, Nov 26 2024 1:09 AM | Last Updated on Tue, Nov 26 2024 1:09 AM

ఇంటర్

ఇంటర్‌వర్సిటీ బ్యాడ్మింటన్‌ టోర్నీకి కేయూ జట్టు

కేయూ క్యాంపస్‌ : కర్ణాటక బెల్గావిలోని విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్‌ యూనివర్సిటీలో నేటినుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్న బ్యాడ్మింటన్‌ టోర్నీకి కాకతీయ యూనివర్సిటీ మహిళా జట్టును ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్స్‌ బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్‌ వై.వెంకయ్య సోమవారం తెలిపారు. ఎం.పూజితా రాగప్రియ ( కేయూసీఈటీ వరంగల్‌ )ఎస్‌.శ్రీనిత, పి.లక్ష్మి (వరంగల్‌ కిట్స్‌), కె.దీక్షిత (ఎస్‌డబ్ల్యూడీసీ, కొత్తగూడెం),ఎన్‌.అశ్విత (ఎంఐఎంఎస్‌ మంచిర్యాల) ఉన్నారు.

నాగసాధువు అఘోరీపై కేసు

మామునూరు : శ్మశాన వాటికలో పూజలు చేసి తల్వార్‌తో కోడి తలను నరికి హింసకు పాల్ప డిన నాగసాధువు అఘోరీ మాతపై మామునూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌ తెలిపారు. ఇన్‌స్పెక్టర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మామునూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధి తిమ్మాపురం క్రాస్‌రోడ్డులోని హిందూ శ్మశానవాటికలో నాగసాధువు, అఘోరీమాత ఇటీవల పూజలు చేస్తు విచక్షణ రహితంగా కోడిని బలి ఇవ్వడంపై నేరంగా పరిగణించాలని కోరుతూ జంతుపరిరక్షణ సమితి ప్రతినిధి కరీంనగర్‌ జిల్లా మానుకొండురు మండలం పచ్చినూరు గ్రామానికి చెందిన కాసురెడ్డి రోహన్‌రెడ్డి సోమవారం మామునూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అఘోరీ మాతపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

ఇంజనీరింగ్‌

విద్యార్థుల ఆందోళన

కళాశాల యాజమాన్య వైఖరిని

నిరసిస్తూ రాస్తారోకో

హసన్‌పర్తి: హసన్‌పర్తి మండలంలోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాజరు శాతం తక్కువగా ఉన్న విద్యార్థులకు అధిక మొత్తంలో జరిమానా విధించడమే కాకుండా సెమిస్టర్‌ ఫీజులకు భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్ష ఫీజులు కూడా పెంచారని వాపోయారు. ఈక్రమంలో తమకు న్యాయం చేయాలని నినాదించారు. ఈ సందర్భంగా రాస్తారోకో చేపట్టగా ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం విద్యార్థులను క్యాంపస్‌లోకి పంపించి ప్రధాన గేట్లు మూసివేశారు. దీంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కళాశాలను దిగ్బంధించారు.

గుట్కా ప్యాకెట్ల స్వాధీనం

కాజీపేట: టాస్క్‌ఫోర్స్‌, స్థానిక పోలీసులు గుట్కాలు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు కాజీపేట పట్టణంలో సోమవారం రాత్రి పలు ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. గన్ను వెంకటేశ్వర్లు అనే వ్యాపారి వద్ద అమ్మకానికి సిద్ధంగా ఉన్న రూ.20,430 విలువ చేసే నిషేధిత గుట్కాలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాజీపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఇంటర్‌వర్సిటీ బ్యాడ్మింటన్‌ టోర్నీకి కేయూ జట్టు
1
1/2

ఇంటర్‌వర్సిటీ బ్యాడ్మింటన్‌ టోర్నీకి కేయూ జట్టు

ఇంటర్‌వర్సిటీ బ్యాడ్మింటన్‌ టోర్నీకి కేయూ జట్టు
2
2/2

ఇంటర్‌వర్సిటీ బ్యాడ్మింటన్‌ టోర్నీకి కేయూ జట్టు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement