సంప్రదాయ క్రీడలను ప్రోత్సహించాలి
గీసుకొండ: ఖోఖో, కబడ్డీ లాంటి సంప్రదాయ క్రీడలను ప్రోత్సహించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. గురువారం వరంగల్ జిల్లాలోని గీసుకొండ జెడ్పీ హైస్కూల్ మైదానంలో 57వ ఖోఖో సీనియర్ అంతర్ జిల్లాల పోటీలను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఖోఖో అసోసియేషన్‌కు రావాల్సిన రూ. 79 లక్షల బకాయిల విషయంపై సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడుతానన్నారు. టోర్నమెంట్ నిర్వహణకు రూ. 5 లక్షల సాయం అందించిన అల్లం బాలకిశోర్‌రెడ్డి, స్వప్న దంపతులను ఈ సందర్భంగా అభినందించారు. ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు అవసరమై స్థలం ఇస్తే సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానన్నారు. గీసుకొండ పాఠశాలలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడానికి ‘కుడా’ నుంచి నిధులు మంజూరు చేయిస్తానన్నారు. ఖోఖో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ జిల్లాకు ఖోఖో పోటీల నిర్వహణకు సింథటిక్ మ్యాట్ మంజూరు చేయిస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే హామీ ఇచ్చారన్నారు. టోర్నమెంట్ ఆర్గనైజర్ వీరగోని రాజ్‌కుమార్ పోటీల నిర్వహణకు సాయం చేసిన కిశోర్‌రెడ్డితో పాటు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్‌ఎఫ్‌సీ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఈఓ జ్ఞానేశ్వర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, ఖోఖో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతి కృష్ణమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట శ్యాంప్రసాద్, ఖమ్మం జిల్లా అధ్యక్షులు పౌడాల రామయ్య, తహసీల్దార్ రియాజొద్దీన్, ఎస్‌బీఐ రిటైర్డ్ మేనేజర్ పెగళ్లపాటి లక్ష్మీనారాయణ, ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కై లాశ్‌యాదవ్, మాజీ ఎంపీపీ బీమగాని సౌజన్య, అల్లం స్వప్న, ఆర్గనైజింగ్ కార్యదర్శి కోట రాంబాబు, మాజీ జెడ్పీటీసీ పోలీసు ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.
మంత్రులు ఎందుకు రాలేదో!
టోర్నమెంట్ ప్రారంభానికి రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, ధనసరి సీతక్క హాజరవుతారని ప్రచారం జరిగింది. వారికి స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ శ్రేణులు గీసుకొండలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే మంత్రులు హాజరుకాలేదు. దీనిపై రాజకీయ కోణం ఉందని పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు చర్చించుకోవడం కనిపించింది.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
గీసుకొండలో ప్రారంభమైన అంతర్ జిల్లాల సీనియర్స్ ఖోఖో పొటీలు
Comments
Please login to add a commentAdd a comment