వరంగల్ మార్కెట్‌కు ఐదు రోజులు సెలవు
వరంగల్ : సంక్రాంతి సందర్భంగా వరంగల్ వ్యవసాయ మార్కెట్ వరుసగా ఐదు రోజులు సెలవు ఉందని, ఈ సమయం యార్డుల్లో ఎలాంటి క్రయ, విక్రయాలు జరగవని మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.నిర్మల ఒక ప్రకటనలో తెలిపారు. 11న (శనివారం)వారాంతపు యార్డు బంద్, 12న(ఆదివారం)వారాంతపు సెలవు, 13న(సోమవారం)భోగి, 14న(మంగళవారం) సంక్రాంతి, 15న (బుధవారం) కనుమ పండుగ ఉన్న నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉంటుందన్నారు. ఈవిషయాన్ని రైతులు, వ్యాపారులు, గుమాస్తా, దడవాయి, కార్మికులు గమనించాలన్నారు. 16వ తేదీన (గురువారం) మార్కెట్ పునఃప్రారంభమవుతుందని పి.నిర్మల పేర్కొన్నారు.
కేయూ తెలుగు విభాగాధిపతి జ్యోతి కన్నుమూత
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం అధిపతి, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్, ఆర్ట్స్ డీన్ ప్రొఫెసర్ ఏటూరు జ్యోతి (55) గురువారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. తీవ్ర అస్వస్థతకు గురై హనుమకొండలోని లోటస్‌కాలనీలో స్వగృహంలోనే గురువారం రాత్రి చనిపోయారు. ఆమెకు భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. జ్యోతి మృతదేహాన్ని అకుట్ జనరల్ సెక్రటరీ ఆచార్య మామిడాల ఇస్తారి, పలువురు అధ్యాపకులు సందర్శించి నివాళులర్పించారు. 2007లో కేయూ తెలుగు విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితులయిన జ్యోతి 2022లో ప్రొఫెసర్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment