ట్రస్మా రాష్ట్ర కార్యవర్గంలో వరంగల్‌కు పెద్దపీట
ఖిలా వరంగల్: హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో బుధవారం రాత్రి ఎన్నుకున్న తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) రాష్ట్ర కార్యవర్గంలో వరంగల్‌వాసులకు ఉన్నత పదవులు దక్కాయి. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎన్.వెంకటేశ్వర్‌రావు(బిర్లా ఓపెన్ మైండ్ ఇంటర్నేషనల్ స్కూల్), రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఆడెపు శ్యామ్ (వందన హైస్కూల్), రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కోడెం శ్రీధర్ (న్యూ కౌటిల్యాస్ హైస్కూల్), రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా టి.జ్ఞానేశ్వర్‌సింగ్ (లిటిల్ బర్డ్స్ హైస్కూల్), రాష్ట్ర జూయింట్ సెక్రటరీగా పి.చక్రపాణి (బాలజ్యోతి హైస్కూల్), కార్యవర్గ సభ్యులుగా అంకతి వీరస్వామి, బిల్లా రవి, సతీశ్‌కుమార్, వెంకట్రాజం, కిరణ్‌కుమార్, వెంకటేశ్వర్లు ఉన్నారు.
అన్నపూర్ణ క్యాంటీన్ ఏర్పాటుకు చర్యలు
ఖిలా వరంగల్: కరీమాబాద్ దర్గాలో అన్నపూర్ణ క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు బల్దియా నిర్ణయం తీసుకుంది. మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈమేరకు గురువారం ఉదయం దర్గా స్థలాన్ని బల్దియా అధికారులు పరిశీలించారు. స్థలాన్ని శుభ్రం చేయించారు. కియోస్క్ (క్యాంటీన్ డబ్బా) ఏర్పాటు చేసిన తర్వాత మంత్రి కొండా సురేఖ అన్నపూర్ణ క్యాంటీన్ ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment