నేటి నుంచి సెపక్‌తక్రా చాంపియన్ షిప్
● పోటీల్లో పాల్గొననున్న 28 రాష్ట్రాల జట్లు
హన్మకొండ: హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 10 (శుక్రవారం) నుంచి 14వ తేదీ వరకు పురుషులు, మహిళల సెపక్‌తక్రా (లెగ్ వాలీబాల్) చాంపియన్ షిప్ 2024–2025 పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సెపక్‌తక్రా అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కానుగంటి సురేశ్ కుమార్ తెలిపారు. దేశ వ్యాప్తంగా 28 రాష్ట్ర జట్లతో పాటు సహస్త్ర సీమాబాల్, ఆల్ ఇండియా పోలీసు జట్టు ఈ పోటీల్లో పాల్గొంటాయని ఆయన గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాలుగు ఈవెంట్లలో పోటీలు జరుగుతాయన్నారు. టీం ఈవెంట్, రేగూ ఈవెంట్, డబుల్ ఈవెంట్, క్వాడ్ ఈవెంట్‌లలో పోటీలు జరుగుతాయని వివరించారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు జేఎన్‌ఎస్‌లో సెపక్‌తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సీఈఓ యోగేందర్ సింగ్ దహియా, ప్రెసిడెంట్ ఎస్.ఆర్.ప్రేమ్‌రాజ్, సెక్రటరీ వీరగౌడ ఈ పోటీలు ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో సెపక్‌తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ కార్యదర్శి ఆర్.శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి వికేశ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కొరిడే శ్రీకాంత్, ప్రతినిధులు రిక్కల వెంకటరామకృష్ణ, కొత్తూరు కపిల్ ఆనంద్ పాల్గొంటారని వివరించారు.
రెండు గ్రూప్‌లుగా సెపక్‌తక్రా జట్లు..
జాతీయ స్థాయి సెపక్‌తక్రా చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనే జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. ఈ వివరాలను కానుగంటి సురేశ్ కుమార్ తెలిపారు. మహిళల విభాగంలో గ్రూప్ ‘ఏ’లో ఎస్‌ఎస్‌బీ, అస్సాం, బిహార్, ఉత్తర్ ప్రదేశ్, గ్రూప్ ‘బీ’లో మణిపూర్, నాగాలాండ్, హరియాణ, తెలంగాణ జట్లు పోటీ పడతాయి. ఈ నెల 11న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. పురుషుల విభాగంలో గ్రూప్ ‘ఏ’లో ఎస్‌ఎస్‌బీ, అస్సాం, తమిళనాడు, మహారాష్ట్ర, గ్రూప్ ‘బీ’లో ఢిల్లీ, మణిపూర్, గోవా, ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ జట్లు ఉన్నాయి. 11న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment