ద్విచక్రవాహన దొంగల అరెస్ట్
వరంగల్ క్రైం: ద్విచక్రవాహన చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఆరు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు హనుమకొండ ఏసీపీ దేవేందర్‌రెడ్డి తెలిపారు.గురువారం సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హనుమకొండలోని మచిలీబజార్, పరకాల మండల వెంకటాపూర్‌కు చెందిన ముసుకుల అఖిల్, ముసుగుల అభిరామ్, ముస్కల సిద్దార్థ, ముసకుల మధుసూదన్.. సుబేదారి, కేయూ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో ఇళ్లలో ఉన్న ద్విచక్రవాహనాలను అపహరించి విక్రయి స్తున్నారు. ఆ డబ్బుతో జల్సా చేస్తున్నారు. ఈ క్ర మంలో గురువారం ఆదాలత్ సెంటర్ వద్ద సుబేదారి ఎస్సై గాలిబ్ తన సిబ్బందితో కలిసి వాహనా లు తనిఖీ చేస్తుండగా ఈ నలుగురు అనుమానాస్పదంగా వెళ్తున్నారు. అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నారు. దీంతో నిందితుల నుంచి ఆరు బైక్‌లు, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఎస్సైలు రామారావు, ఫణి, గాలిబ్ పాల్గొన్నారు.
ఆరు బైక్‌లు స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఏసీపీ దేవేందర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment