రేపు, ఎల్లుండి క్రెడాయ్ ప్రాపర్టీ షో
క్రెడాయ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.ప్రేమ్‌సాగర్ రెడ్డి, వరంగల్ అధ్యక్షుడు ఈ.తిరుపతి రెడ్డి
నయీంనగర్ : క్రెడాయ్ వరంగల్ చాప్టర్ ఆధ్వర్యంలో ఈ నెల 11, 12వ తేదీల్లో హనుమకొండలోని పీజీఆర్ గార్డెన్‌లో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నామని, గ్రేటర్ వరంగల్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని క్రెడాయ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.ప్రేమ్‌సాగర్ రెడ్డి, వరంగల్ అధ్యక్షుడు ఈ.తిరుపతి రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం కే యూ క్రాస్‌లోని క్రెడాయ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఇల్లు, విల్లా, అపార్ట్‌మెంట్ కొనుగోలు చేయాలనుకునే వారు, స్వయంగా ఇల్లు నిర్మించుకునే వారికి సౌకర్యంగా ఉండేందుకు నగరంలో నిర్మాణమవుతున్న అన్ని అపార్ట్‌మెంట్లు, విల్లాలు, లే అవుట్‌ల సమాచారంతో పాటు ఇంటి నిర్మాణానికి కావాల్సిన ప్రొడక్ట్స్ సమాచారం ఒకే వేదికపై ఉంటుందన్నారు. లోన్ సౌకర్యం కోసం వివిధ బ్యాంకులు ఈ ప్రాపర్టీ షోలో ఒకే వేదికపై ఉంటాయన్నారు. రాష్ట్ర రెండో రాజధానిగా హైదరాబాద్ తరువాత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌లో కస్టమర్ సొంత ఇంటి కల నమ్మకమైన బిల్డర్‌ల ద్వారా రెరా అఫ్రూ వడ్ స్థిరాస్తులను ప్రాపర్టీ షోలో చూడొచ్చని తెలి పారు. బిల్డర్లు నిర్మించే అపార్ట్‌మెంట్లు ఒకే చోట స్టాళ్లు ఏర్పాటు చేసి డిస్‌ప్లే చేస్తామని, అన్ని స్టాళ్లు తిరిగి బ్రోచర్లు తీసుకుని కుటుంబ సభ్యులు అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చన్నారు.
ఇక్కడ బిలర్లు డిస్కౌంట్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ప్రాపర్టీ షోలో కస్టమర్ కొనుగోలు చేసే స్థిరాస్తులకు వరంగల్ క్రెడాయ్ పూర్తి బాధ్యత వహిస్తుందన్నారు. కస్టమర్ కొనుగోలు శక్తి అనుగుణంగా రూ. 40 లక్షల నుంచి రూ. 3కోట్ల వరకు అందుబాటు ధరల్లో ప్రాపర్టీ షోలో ఉన్నాయన్నారు. క్రెడాయ్ తన వంతు సాయంగా సమాజానికి సేవ చేస్తోందన్నారు. ఇందులో భాగంగా రక్తదాన శిబిరా లు, పాఠశాలలో టాయిలెట్లు, వాటర్ ప్లాంట్లు, పబ్లిక్ టాయిలెట్లు, వరదల సమయంలో గ్రామాలను దత్తత తీసుకుంటోందని తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ క్రెడాయ్ కార్యదర్శి జె.మనోహర్, ఉపాధ్యక్షులు ఎన్.అమరేందర్‌రెడ్డి, ఎస్.అమరలింగేశ్వర్ రావు, ఎం.రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment