తేమశాతం ఉన్న ధాన్యం వెంటనే కొనాలి
జగిత్యాలరూరల్: ఐకేపీ కేంద్రాల్లో వరిధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సోమవారం జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట్, జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి గ్రామాలతో పాటు చల్‌గల్ ఏఎంసీ సెంటర్, ఐకేపీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తేమ శాతం ఉన్న ధాన్యాన్ని వెనువెంటనే కొనుగోలు చేయాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.
ఎలాంటి తప్పులుండొద్దు
జగిత్యాల: సమగ్ర కుటుంబ సర్వేలో ఎలాంటి తప్పులుండకూడదని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డు, రవీంద్రనగర్ కాలనీల్లో సర్వేను పరిశీలించారు. పత్రంలోని ప్రశ్నలను సరిగ్గా అడగాలని, ఓపికతో సమాధానాలు రాబట్టుకోవాలన్నారు.
పకడ్బందీగా చేపట్టాలి
రాయికల్(జగిత్యాల): సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. సోమవారం రాయికల్ మండలం ఆలూరులో సర్వేను పరిశీలించారు. ప్రతీ ఇంటి గోడపై కచ్చితంగా స్టిక్కర్ అంటించాలన్నారు. సర్వే సమయంలో కుటుంబ యజమాని నుంచి సేకరించిన సమాచారం గోప్యంగా ఉంచబడుతుందని తెలిపారు. అనంతరం తాట్లవాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు.
తప్పులు దొర్లకుండా చూడాలి
సారంగాపూర్(జగిత్యాల): సమగ్ర కుటుంబ సర్వేలో తప్పులు దొర్లకుండా చూడాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామంలో సర్వేను పరిశీలించారు. సర్వే వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం పెంబట్ల, రంగపేట గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కార్యక్రమాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి, జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్, ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్లు రామ్మోహన్, ఖయ్యూం, జమీర్, మండల ప్రత్యేకాధికారి సుజా త, ఎంపీడీవో చౌడారపు గంగాధర్, ఎంపీవోలు సుష్మ, శశికుమార్‌రెడ్డి, సూపర్‌వైజర్ చందన కృష్ణ, పంచాయతీ కార్యదర్శి సర్వశిష్ట పాల్గొన్నారు.
● కలెక్టర్ సత్యప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment