దేశ సంస్కృతి, ధర్మాన్ని కాపాడుకోవాలి
జగిత్యాలటౌన్: దేశ సంస్కృతి, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ధర్మ జాగరణ సమితి విభాగ్ ప్రముఖ్ ఇప్ప లచ్చన్న పేర్కొన్నారు. హిందూ సమాజాన్ని జాగృతం చేసేందుకు ఆదివారం రాయికల్ పట్టణం గుడికోట ఆలయం నుంచి ప్రారంభమైన రఽథయాత్ర వివిధ గ్రామాల మీదుగా సోమవారం జగిత్యాలకు చేరుకుంది. ఈసందర్భంగా స్థానిక మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం టవర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లచ్చన్న మాట్లాడారు. వందల సంవత్సరాలు మన దేశాన్ని విదేశీయులు పాలించడం వల్ల మన ధర్మాన్ని, సంస్కృతిని కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ధర్మానికి హాని కలిగించే శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆలయాల ఆధారంగా ధర్మజాగరణ జరగాలని ఇందుకు ప్రతీ హిందువు కృషి చేయాలని కోరారు. హిందూవాహిని విభాగ్ ప్రముఖ్ వేముల సంతోష్, లక్ష్మీనర్సయ్య స్వామి, చుక్క ప్రకాశ్, సిద్దం మహేశ్, ముద్దం గంగారెడ్డి, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment