ఉన్న ఊరు కన్నతల్లి లాంటిది
జగిత్యాలరూరల్: ఉన్న ఊరు కన్నతల్లి లాంటిదని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. గురువారం జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం ఎమ్మెల్యే సొంత ఖర్చులతో టీవీ ప్రొజెక్టర్‌ను అందించారు. గ్రామంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. రాంపూర్ పంప్‌హౌస్‌నుంచి పైప్‌లైన్ వేసి చెరువు నింపామని, చెరువు జలకళ సంతరించుకుందని, భూగర్భజలాలు పెరిగి సాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు రవీందర్‌రెడ్డి, బోనగిరి నారాయణ, రాజిరెడ్డి, శ్రీనివాస్, నోముల శేఖర్‌రెడ్డి, ఎంపీడీవో రమాదేవి, ఎంఈవో గాయత్రి పాల్గొన్నారు.
సీఎం సహాయనిధిని
సద్వినియోగం చేసుకోవాలి
జగిత్యాల: సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. 17 మంది లబ్ధిదారులకు రూ.4.90 లక్షల విలువ గల చెక్కులు అందించారు.
గంగపుత్రులకు అండగా ప్రభుత్వం
జగిత్యాలటౌన్: గంగపుత్రులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రపంచ మత్స్యకార దినోత్సవంలో పాల్గొన్నారు. మత్స్యకార్మికులు చనిపోతే రూ.5లక్షల ఆర్థిక సహాయాన్ని జాప్యం లేకుండా అందిస్తున్నామని తెలిపారు. గల్ఫ్ గంగపుత్ర సంఘం అధ్యక్షుడు తిరుపతి, కౌన్సిలర్ జుంబర్తి రాజ్‌కుమా పాల్గొన్నారు.
దివ్యాంగులకు ఐదుశాతం డబుల్ ఇళ్లు
దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించి గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఇళ్లు మంజూరు చేశామని ఎమ్మెల్యే అన్నారు. జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో నిర్వహించిన దివ్యాంగుల క్రీడా మహోత్సవాన్ని జెండా ఊపి ప్రారంభించారు. దివ్యాంగులకు బ్యాటరీ సైకిల్లు, కృత్రిమ అవయవాలు అందించామన్నారు. దివ్యాంగుల సంక్షేమ అధికారి భోనగిరి నరేశ్, ఎస్జీఎఫ్ సెక్రెటరీ లక్ష్మీరాంనాయక్, ఏఓ శ్రీనివాస్, డీవైఎస్‌ఓ రవికుమార్ పాల్గొన్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment