తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే..
జగిత్యాల: వయోవృద్ధులైన తల్లిదండ్రులను విస్మరిస్తే శిక్షార్హులేనని ఆర్డీవో మధుసూదన్ అన్నారు. ఆర్డీవో కార్యాలయంలో శనివారం పలు కేసులను విచారించారు. మల్యాల మండలం రామన్నపేటకు చెందిన పంజాల దుంపెటి, జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తికి చెందిన బోదనపు లక్ష్మీరాజు, సారంగాపూర్‌కు చెందిన ఆసిరెడ్డి సుగుణమ్మ, మల్యాల మండలానికి చెందిన శంకరమ్మ తమ కొడుకులు, కూతుళ్లు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేయడంతో వారిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. కుమారుల నుంచి పోషణ, సంరక్షణ అందకపోతే ఆస్తులు తిరిగి తల్లిదండ్రులకు ఇప్పించడం జరుగుతుందని ఆర్డీవో తెలిపారు. అలాగే సంరక్షణ చట్టం 2007 ప్రకారం 6 నెలల జైలుశిక్ష, జరిమానా పడుతుందని పేర్కొన్నారు. అనంతరం బాధితుల వాంగ్మూలం, సాక్ష్యాధారాలను పరిశీలించారు. ఇక నుంచి తల్లిదండ్రులను పట్టించుకోకుంటే కేసు నమోదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏవో తఫజుల్ హుస్సేన్, సీనియర్ సిటిజన్ కమిటీ అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్, విశ్వనాథ్, ప్రకాశ్‌రావు, పద్మజ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment