ప్రజా పోరాటాలకు పెట్టింది పేరైన సిరిసిల్ల కాలానుగుణంగా శరవేగంగా పురోగమిస్తున్న జిల్లా కేంద్రం. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్ననాటి నుంచే ప్రపంచం గుర్తించిన మేధావులకు జన్మనిచ్చిన నేల. పేద, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన ఎంతోమంది ఉన్నత చదువులు చదివారు. రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రొఫెసర్లుగా పని చేశారు. ఉస్మానియా, అంబేడ్కర్, తెలుగు, కాకతీయ, శాతవాహన, తెలంగాణ వర్సిటీలకు వీసీలుగా బాధ్యతలు నిర్వహిస్తూ విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారు. వీరితో పాటు పలువురు ఉమ్మడి కరీంనగర్ జిల్లావాసులు కూడా ఉన్నారు. – సిరిసిల్ల కల్చరల్
Comments
Please login to add a commentAdd a comment