మార్కెట్ అభివృద్ధికి సహకరించండి
మెట్‌పల్లి: మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి సహకరించాలని మంత్రి శ్రీధర్‌బాబుకు చైర్మన్ కూన గోవర్దన్ వినతిపత్రం అందించారు. మంత్రిని హైదరాబాద్‌లో సోమవారం కలిశారు.ఆయన వెంట పీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజీత్‌రావు, నాయకులు వాకిట సత్యంరెడ్డి, కూన రాకేశ్, గిరి, మారుతి, నవీన్ ఉన్నారు. అలాగే పట్టణంలో నిర్మిస్తున్న ఉర్దూ మీడియం పాఠశాల భవనం, షాదీఖానాలకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని మర్కజీ ఇంతేజామి కమిటీ అధ్యక్షుడు ఖుత్బూద్దీన్ మంత్రికి విజ్ఞప్తి చేశారు.
బాధితులకు సత్వర న్యాయం చేయాలి
జగిత్యాలక్రైం: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడాలని, ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
కేంద్రాల్లో విక్రయిస్తేనే బోనస్
రాయికల్: సన్న రకం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తేనే బోనస్ వర్తిస్తుందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతు రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని, నిధుల సమీకరణలో జాప్యం కావడంతో దశల వారీగా విడుదల చేస్తున్నామని తెలిపారు. పట్టణంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల మేనిపెస్టోలో ప్రకటించిన ప్రతి హామీనీ అమలు చేస్తామన్నారు. జిల్లాలోనే గతేడాది 75లక్షల టన్నుల ధాన్యాన్ని కొంటే.. ఈసారి 1.44 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొని రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేశామని గుర్తుచేశారు. నాయకులు గోపి రాజిరెడ్డి, ఎద్దండి భూంరెడ్డి, కొయ్యడి మహిపాల్‌రెడ్డి, పత్తిరెడ్డి మహిపాల్‌రెడ్డి, ఆదిరెడ్డి, బాపురపు నర్సయ్య, తలారి రాజేశ్, తిరుపతిరెడ్డి, గుమ్మడి సంతోష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment