ఆమెకు భద్రత ఏదీ..?
జగిత్యాల: మహిళా ఉద్యోగులకు రక్షణగా నిలిచేందుకు ప్రతిశాఖలో లైంగిక వేధింపులపై ఫిర్యాదు స్వీకరించి సమస్యను పరిష్కరించేందుకు అంతర్గత కమిటీలను ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలు మహిళాఉద్యోగులపై వేధింపులు జరిగితే అరికట్టేందుకు సంబంధిత శాఖ తరఫున చర్యలు తీసుకోవాలి. జిల్లాస్థాయి మొదలు.. డివిజనల్, మున్సిపాలిటీ, మండలస్థాయి వరకు నోడల్ ఆఫీసర్లను కమిటీలో నియమించారు. అయినప్పటికీ మహిళలపై లైంగిక వేధింపులు మాత్రం ఆగడం లేదు. కొందరు మహిళలు బయటకు చెప్పుకోలేక కమిటీ దృష్టికి తీసుకెళ్లడం లేదు. కొందరు ధైర్యంగా తీసుకెళ్లినప్పటికీ ఆశించిన మేర ఫలితం లేకపోవడం గమనార్హం. ఈ క్రమంలో వేధింపులు తీవ్రమైతేనే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో మళ్లీ ఈ కమిటీలే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటున్నారు. వాస్తవంగా సమస్యను గోప్యంగా ఉంచడంతోపాటు, మహిళలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఈ కమిటీ చూడాల్సి ఉంది. ఒక్కోసారి సమస్య బయటపడుతుండడంతో వేధింపులకు గురైనా ఉన్నతాధికారులకు చెబితే ఏమైనా సమస్యలు ఏర్పడతాయన్న ఉద్దేశంతో మహిళలు లోలోపలే మదన పడుతున్నారు. ప్రస్తుతం అన్నిశాఖల్లో సగానికి పైగా మహిళలే ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో రెండు వేలకుపైగా మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నట్లు అంచనా. గతంలో కోరుట్ల ప్రాంతంలో ఓ శాఖలో ఓ ఉన్నతస్థాయి అధికారి ఇద్దరు మహిళలను వేధించగా అది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఆ సమయంలో ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోవడంతో మహిళలకు న్యాయం జరగలేదు. జిల్లాలో అనేకచోట్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా.. ఉన్నతస్థాయి అధికారులు బయటకు తెలిస్తే శాఖ పరువుపోతుందని లోలోపలే సమస్యను పరిష్కరిస్తున్నారు. ఫలితంగా వేధింపులకు గురిచేసిన అధికారులే చాకచక్యంగా తప్పించుకుంటున్నారు. కొందరు ఉపాధ్యాయులు విద్యార్థినులను వేధించిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇలా ఇటీవలే ఓ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది.
ప్రతి శాఖలో సంఘటనలు..
జిల్లాలోని ప్రతి శాఖలో.. ప్రతి చోట మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయి. బయటకు చెప్తే ఇబ్బందులొస్తాయని, ఉన్నతాధికారుల నుంచి సమస్యలు ఎదురవుతాయేమోనని కొందరు మహిళలు లోలోపలే మదనపడుతూ ఫిర్యాదు చేయడం లేదు. అలాంటి వారికోసం ఏర్పాటు చేసిన కమిటీలు కూడా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. జిల్లాస్థాయిలో కమిటీ అధ్యక్షులుగా ఉపాధి కల్పన అధికారి సత్తమ్మ ఉన్నారు. సంఘటన జరిగితే ఫోన్ చేసిగానీ, లిఖిత పూర్వకంగా ఇస్తే పూర్తిస్థాయిలో విచారించి కమిటీ తరఫున చర్యలు తీసుకుంటామని అవగాహన కల్పిస్తున్నా.. అవగాహన లేకనో, బయటకు తెలిస్తే పరువు పోతుందనో చాలామంది కమిటీకి చెప్పుకోలేకపోతున్నారు. ఈ కమిటీలో ఉన్నతస్థాయి అధికారి, అడ్వకేట్‌లు ఉంటారు. వేధింపుల బారిన పడినవారికి రక్షణగా ఉంటారు.
ప్రస్తుతం జిల్లాస్థాయిలో పనిచేస్తున్న కమిటీ
సత్తమ్మ, చైర్‌పర్సన్, ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ సెల్ : 95027 91442
సభ్యులు
కె.వసంత, తహసీల్దార్, మేడిపల్లి 83096 14304
సీహెచ్.అనురాధ, సీనియర్ అడ్వకేట్ 98664 56449
రావుల సరిత, సీనియర్ అడ్వకేట్ 94949 92856
బి.నరేశ్, డీడబ్ల్యూవో, ఎక్స్ అషియో సభ్యుడు 90000 13624
వీరితోపాటు, డివిజన్, మున్సిపాలిటీ, మండలస్థాయిలో ఫిర్యాదు చేసేందుకు నోడల్ ఆఫీసర్లు
ఉంటారు. నేరుగా జిల్లాస్థాయి సభ్యులకు కూడా ఫిర్యాదు చేయొచ్చు.
మహిళా ఉద్యోగులకు తప్పని వేధింపులు జిల్లాలో నిత్యం ఏదోచోట సంఘటనలు కమిటీ ఉన్నా చెప్పుకోలేకపోతున్న మహిళలు
జిల్లాలోని విద్యాశాఖలో పనిచేస్తున్న
ఓ ఉద్యోగిని అదే శాఖలో పనిచేస్తున్న మరో ఉద్యోగి లైంగికంగా వేధిస్తున్నాడు. సదరు ఉద్యోగి వేధింపులను గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ లేకపోవడంతో ఏకంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. దీంతో నిందితుడిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు. గతంలో కూడా ఇదేశాఖలో ఓ మహిళ ఉద్యోగినిని వేధించిన ఉద్యోగిని సస్పెండ్ చేశారు. ఇలాంటి వేధింపులు జిల్లాలో నిత్యం ఏదోచోట వెలుగుచూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఉపాధ్యాయుడిపై విచారణ
కానరాని ఫిర్యాదుల పెట్టెలు..?
కలెక్టరేట్‌లో మహిళలకు ఏవైనా ఇబ్బందులుంటే గతంలో నేరుగా ఫిర్యాదు రాసి బాక్స్‌లో వేసేవారు. అవి ప్రస్తుతం ఎక్కడా కన్పించడం లేదు. డివిజన్, మండలాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిర్యాదు బాక్స్‌లు ఉంటే మహిళాఉద్యోగినులకు మేలు కలుగుతుంది. అధికారులు స్పందించి ప్రతి చోటా ఫిర్యాదు బాక్స్ ఏర్పాటు చేయాలని మహిళలు కోరుతున్నారు.
జిల్లాలోని ఓ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఉపాధ్యాయురాలిపై లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని కలెక్టర్‌కు ఫిర్యాదు వెళ్లడంతో ఆయన విచారణ చేపడుతున్నారు. సదరు ఉపాధ్యాయుడికి మెమో జారీ చేసి విచారణ చేస్తున్నట్లు డీఈవో జగన్మోహన్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment