స్లాటర్‌హౌజ్ స్థలాన్ని కాపాడండి
జిల్లాకేంద్రంలోని గాంధీనగర్‌లో వందేళ్ల క్రితం మేకలు కోసేందుకు ప్రభుత్వం కబేళా నిర్మించి ఇచ్చింది. ఈ కబేళా ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదు. కబేళా వెనుక భాగంలో ఉన్న శ్మశాన వాటికకు వెళ్లేదారిని మహిళా సంఘ భవన నిర్మాణం పేరిట కొందరు కబ్జా చేయాలని చూస్తున్నారు. కబేళా స్థలానికి హద్దులు నిర్ణయించి కబ్జా కాకుండా చూడండి. భవిష్యత్తులో కబేళా అవసరాలకు ఉపయోగపడేలా చూడండి.
– ఆరెకటిక సంఘం ప్రతినిధులు
ప్రభుత్వ భూమి అందరికీ చెందాలి
చిల్వాకోడూర్ గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నంబర్లు 220, 221లోగల నాలుగెకరాల ఎస్సీ కాలనీకి చెందిన స్థలంలో గ్రామపంచాయతీ అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నారు. స్థలం పక్కన రైతులు కూడా ఎస్సీల భూమిని కబ్జా చేస్తున్నారు. ఇందులో కొందరు అక్రమంగా ఎక్కువ స్థలాన్ని ఆక్రమించుకోగా నిజమైన అర్హులకు స్థలం లేకుండాపోతోంది. మా పూర్వీకులు వెట్టి చాకిరి చేసి సంపాదించుకున్న ఈ స్థలాన్ని సర్వే చేయించి అనర్హుల నుండి కాపాడి అర్హులైన ఎస్సీలందరికీ చెందేలా చర్యలు తీసుకోండి.
– చిల్వాకోడూర్ అంబేద్కర్ సంఘం ప్రతినిధులు
Comments
Please login to add a commentAdd a comment