మోటార్లకు కెపాసిటర్లు తప్పనిసరి
రాయికల్: రైతులు తమ వ్యవసాయ మోటార్లకు తప్పనిసరిగా కెపాసిటర్లు అమర్చుకోవాలని డీఈఈ రాజిరెడ్డి అన్నారు. మండలంలోని కుమ్మరిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ను మంగళవారం ప్రారంభించారు. రైతుల సౌలభ్యం కోసం ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నామని, విద్యుత్ సమస్యలు ఎదురైతే 1912 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఈ సింధూర్‌శర్మ, ఏఈ నవీన్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు భూమయ్య, రైతు సంఘం నాయకులు బుచ్చిరాజం, బొల్లె రాధ, శేఖర్, అనంతయ్య, కాంతయ్య, ఇంద్రాల రాజేశ్, భూమరాజం పాల్గొన్నారు.
రాయికల్‌లో కార్గో సేవలు ప్రారంభం
రాయికల్: రాయికల్ పట్టణంలోని పాతబస్టాండ్‌లో కార్గో లాజిస్టిక్ కౌంటర్‌ను కరీంనగర్ రీజియన్ కార్గో లాజిస్టిక్స్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ రామారావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్కువ సమయంలో వివిధ వస్తువులను వేగవంతంగా పంపించేందుకు కార్గో సేవలు ఉపయోగపడతాయని తెలిపారు. రాయికల్ పట్టణ, మండల ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో రాయికల్ ఏజెంట్ శ్రీకాంత్ పాల్గొన్నారు.
పాడి పశువుల పెంపకంతో రైతులకు ఉపాధి
జగిత్యాలరూరల్: పాడి పశువుల పెంపకంతో రైతులకు ఉపాధి దొరుకుతుందని జిల్లా పశువైద్య, పశుసంవర్థక శాఖ అధికారి లక్ష్మీమనోహర్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం మోరపల్లిలో మంగళవారం ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పాడి పశువులకు సమీకృత ఆహారం అందించడం ద్వారా అధిక పాల దిగుబడి పొందవచ్చన్నారు. దూడల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పాడిగేదెలకు ఖనిజ, లవణ మిశ్రమం, విటమిన్ మిశ్రమం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి నరేశ్‌రెడ్డి, సిబ్బంది నాగేందర్, రవీందర్, వీఏ రమేశ్, సిబ్బంది బక్కయ్య, పోచయ్య, అహ్మద్ పాల్గొన్నారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం
జగిత్యాలటౌన్: తెలంగాణ పాటల గొంతుక, ప్రజాయుద్ధ నౌక గద్దర్‌పై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బీరం రాజేశ్ మాట్లాడుతూ సంజయ్ వెంటనే తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు విజయవంతం
జగిత్యాల: వానాకాలం సీజన్లో ధాన్యం కొనుగోళ్లు విజయవంతం అయ్యాయని అదనపు కలెక్టర్ బీఎస్.లత అన్నారు. మొత్తం 424 కొనుగోలు కేంద్రాల ద్వారా 68,543 మంది రైతుల నుంచి 3,08,270 టన్నుల ధాన్యం సేకరించామన్నారు. ఇందులో 2,77,177 టన్నుల దొడ్డు రకం, 31,092 టన్నుల సన్నరకం ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రైతులకు మద్దతు ధరగా గ్రేడ్ ఏ రకానికి రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 చొప్పున చెల్లించామని, రైతులకు రూ.715 కోట్లు వారివారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment