నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలి | Sakshi
Sakshi News home page

నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలి

Published Fri, Apr 19 2024 1:50 AM

స్ట్రాంగ్‌ రూంను పరిశీలిస్తున్న రోహిత్‌సింగ్‌ - Sakshi

రఘునాథపల్లి: వేసవిలో తాగు నీటి ఎద్దడి తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవడంతోపాటు అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగితన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ పింకేష్‌కుమార్‌ అన్నారు. గురువారం మండల పరిధి గోవర్ధనగిరి, ఖిలాషాపూర్‌, కుసుంబాయితండాలను ఆకస్మికంగా సందర్శించిన ఆయన తాగునీటి సరఫరాపై అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో చర్చించారు. ఎండల తీవ్రత పెరిగిన దృష్ట్యా ప్రజలకు తాగు నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ఇప్పటికే రూపొందించిన యాక్షన్‌ ప్లాన్‌ ప్రకారం చర్యలు చేపట్టాలని మిషన్‌ భగీరథ డీఈ కరుణ్‌కుమార్‌ను ఆదేశించారు. అమ్మ ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో చేపట్టిన పనులను పర్యవేక్షించాలని చెప్పారు. ఆయన వెంట పంచాయతీ రాజ్‌ డీఈ శ్రీనివాస్‌, డీఈఓ రాము, ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు, మిషన్‌ భగీరథ ఏఈ లక్ష్మీపతి, పీఆర్‌ ఏఈ తదితరులు పాల్గొన్నారు.

స్ట్రాంగ్‌ రూంను పరిశీలించిన అదనపు కలెక్టర్‌

పాలకుర్తి టౌన్‌: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో పాలకుర్తి నియోజవకర్గ కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంను గురువారం అదన పు కలెక్టర్‌, ఏఆర్‌ఓ రోహిత్‌సింగ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఆయన వెంట సీఐ మహేందర్‌రెడ్డి, తహసీల్థార్‌ వెంకటేశం, ఎస్సై సాయిప్రసన్నకుమార్‌, ఎన్నికల టీడీ రామరావు ఉన్నారు.

అదనపు కలెక్టర్‌ పింకేష్‌కుమార్‌

స్కూల్‌లో ఏఈతో మాట్లాడుతున్న పింకేష్‌కుమార్‌
1/1

స్కూల్‌లో ఏఈతో మాట్లాడుతున్న పింకేష్‌కుమార్‌

Advertisement
Advertisement