శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
● డీఐఈఓ జితేందర్‌రెడ్డి
స్టేషన్‌ఘన్‌పూర్: ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఓజేటీ (ఆన్ ద జాబ్ ట్రైనింగ్)ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జితేందర్‌రెడ్డి అన్నారు. ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలోని రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఒకేషనల్ విద్యార్థులకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి, ఎంపీడీఓ ఆఫీస్, తహసీల్దార్ కార్యాలయం, విద్యుత్ సబ్‌స్టేషన్, ట్రాన్స్‌ఫార్మర్ రిపేరింగ్ సెంటర్‌లో నిర్వహిస్తున్న ఓజేటీ శిక్షణను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తప్పనిసరిగా ఉదయం స్టడీ అవర్స్‌కు రావాలన్నారు. ఒకేషనల్ విద్యార్థులు ఆయా విభాగాల్లో తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. శిక్షణలో పాటించాల్సిన జాగ్రత్తలు, నేర్చుకోవాల్సిన అంశాలపై సలహాలు, సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జి.కమలాకర్, అధ్యాపకులు సాంబమూర్తి, సౌభాగ్యలక్ష్మీ, సౌందర్య, ప్రేమ్‌కుమార్, థామస్, స్రవంతి, గౌతమి, రమేష్, కరుణాకర్, నిఖత్‌బేగం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment