‘ప్రజా పాలన’ ప్రచార వాహనాలు ప్రారంభం
జనగామ రూరల్: ప్రజాపాలన విజయోత్సవాలపై ఏర్పాటు చేసిన ప్రచార వాహనాలను మంగళవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో కలెక్టర్ రిజ్వాన్ బాషా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 19 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులతో కళాయాత్ర కొనసాగుతుందన్నారు. జనగామ డివిజన్‌కు 11 మంది, స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్‌కు 10 మంది కళాకారులకు 2 వాహనాలను ఫ్లెక్సీ, మైక్ సిస్టంతో ప్రచార వాహనాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి కె.శ్రీనివాసరావు, కార్యాలయం సిబ్బంది, సారధి కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment