ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వద్దు
జనగామ రూరల్: ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేయవద్దని సీఎస్ శాంతికుమారి అన్నారు. మంగళవారం సీఎస్ కలెక్టరేట్‌కు రాగా కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు రోహిత్ సింగ్, పింకేష్ కుమార్, జెడ్పీ సీఈఓ మాధురి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ చాంబర్‌లో ధాన్యం కొనుగోలు, సమగ్ర సర్వే వివరాలను కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ జిల్లాలో సాఫీగా కొనసాగుతుందని.. చె ల్లింపులు కూడా ఎప్పటికప్పుడు అయ్యేలా రైతుల వివరాలను నమోదు చేస్తున్నారని కలెక్టర్ తెలి పారు. ఇప్పటి వరకు దొడ్డు రకం ధాన్యంకు రూ.78 కోట్లు, సన్నరకం ధాన్యంకు రూ.1 కోటి వరకు చె ల్లించడం జరిగిందన్నారు. అలాగే ఇప్పటి వరకు జి ల్లాలో 93.5 శాతం సర్వే పూర్తయిందన్నారు. డేటా ఎంట్రీ ప్రక్రియ కూడా ప్రారంభమైందన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని
సందర్శించిన ప్రిన్సిపల్ సెక్రటరీ
పెంబర్తిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, కలెక్టర్ రిజ్వాన్ బాషా, అడిషనల్ కలెక్టర్ రోహిత్‌సింగ్‌లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో ధాన్యం తేమ శాతం, ధాన్యం కాంటా, రవాణా, ఆన్‌లైన్ తదితర వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గోపిరామ్, తహసీల్దార్ హుస్సేన్, డీఎస్‌ఓ సరస్వతి, శ్రీనివాస్, రాంమోహన్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
స్టేషన్‌ఘన్‌పూర్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి రామారావునాయక్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతీ మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు మండలంలోని నమిలిగొండ ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి మంగళవారం డీఏఓ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. వరిపంట సాగు చేసి ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించిన రైతులతో రైతునేస్తం కార్యక్రమంలో నేరుగా వీసీలో మాట్లాడించారు. జిల్లాలో వరిపంట సాగు, దిగుబడి, ధాన్యం కొనుగోళ్లు తదితర వివరాలను డీఏఓ వివరించారు. నమిలిగొండ గ్రామం నుంచి అత్యధికంగా రిక్కల సంపత్‌రెడ్డి 111 క్వింటాళ్లు కొనుగోలు సెంటర్‌లో విక్రయించగా మద్దతు ధర రూ.2,57,520, బోనస్ డబ్బులు రూ.55వేలు, మొత్తం రూ.3,13,020 వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి చంద్రన్‌కుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
సీఎస్ శాంతికుమారి
ధాన్యం సేకరణ, సమగ్ర సర్వేపై సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment