నేడే గ్రూప్–3 పరీక్ష
జనగామ రూరల్: జిల్లాలో నేటి నుంచి జరిగే గ్రూప్–3 పరీక్షను పకడ్బందీగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశామని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని క్రీస్తు జ్యోతి ఇంజనీరింగ్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించా రు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి ఘ టనలు జరగకుండా పరీక్ష రాసేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. నేడు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్–1, మధ్యాహ్నం 3 నుంచి 5.30 వరకు పేపర్–1, 18వ తేదీన ఉదయం 10 నుంచి 12:30 గంటల వరకు పేపర్–3 పరీక్ష ఉంటుందన్నారు. జిల్లాలో మొత్తం 16 సెంటర్లలో 5,446 మంది అభ్యర్థులు హాజరు కానున్నారన్నారు. పరీక్ష నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్‌లు (16), డిపార్ట్‌మెంటల్ అధికారులు (16), అబ్జర్వర్‌లు (16), ఫ్లయింగ్ స్క్వాడ్ లు 4, బయోమెట్రిక్ అధికారులు (43), ఐడెంటిఫికేషన్ అధికా రులు (55), నాలుగు రూట్లలో నలుగురు రూట్ అధికారులను నియమించారు. వంద శాతం బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోవాలని ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరాకు విద్యుత్ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోగా పరీక్ష కేంద్రాలకు ఆర్టీసీ బస్సులు సరిపడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.
144 సెక్షన్ అమలు
రెండు రోజుల పాటు జరిగే గ్రూప్–3 పరీక్షకు ఎలాంటి సంఘటనలు కాకుండా పోలీస్‌లు పరీక్ష కేంద్రాల వద్ద భద్రత నిర్వహించనున్నారు. ఈ మేరకు శనివారం డీసీపీ రాజామహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో ఏసీపీ పార్థసారధితో కలిసి పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సెంటర్ వద్ద 144 సెక్షన్ (163 బీఎంఎస్‌ఎస్) అమలులో ఉంటుందన్నారు. పరీక్షల కోసం 4 రూట్ మ్యాప్ చేసినట్లు తెలిపారు.
సందేహాల నివృత్తికి కంట్రోల్ నంబర్..
అభ్యర్థుల సందేహాల నివృత్తికి కలెక్టరేట్‌లో కంట్రో ల్ నంబర్ 9052308621 ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్‌ను ఏ4 సైజ్ పేపర్‌లో కలర్ ప్రింట్ తీసుకోవాలని, తాజా పాస్ పోర్టు ఫొటోను అతికించాలన్నారు. పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని, పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తామని, పరీక్ష రాసే అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలని, ఆభరణాలు ధరించరాదని సూచించారు.
పరీక్ష కేంద్రాల వివరాలు
ఏబీవీ డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల, సాన్‌మారియా హైస్కూల్, సెయింట్ పాల్స్ హైస్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ధర్మకంచ, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, సెయింట్ మేరీస్ హైస్కూల్ హైదరాబాద్ రోడ్డు, గీతాంజలి హైస్కూల్, ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాల, ఏకశిల డిగ్రీ కళాశాల, క్రీస్తు జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల, నారాయణ హైస్కూల్, ఏకశిల బీఎడ్ కళాశాల, అరబిందో హైస్కూల్, ఏకశిల పబ్లిక్ స్కూల్, వైష్ణవి హైస్కూల్.
సర్వం సిద్ధం చేసిన యంత్రాంగం
జిల్లాలో 16 కేంద్రాల్లో
5,446 మంది అభ్యర్థులు
సీసీ నిఘాలో పరీక్షల నిర్వహణ
కలెక్టరేట్‌లో 9052308621
కంట్రోల్ నంబర్
సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు
Comments
Please login to add a commentAdd a comment