అభివృద్ధి బాటలో రైల్వే ఈసీసీఎస్
కాజీపేట రూరల్: రైల్వే ఎంప్లాయీస్ కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (ఈసీసీఎస్)ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు ఈసీసీఎస్ ఎం.డి, మజ్దూర్ యూనియన్ ఏడీఎస్ చిలుకుస్వామి అన్నారు. కాజీపేట రైల్వే డీజిల్ లోకో షెడ్ ఎదుట శుక్రవారం రైల్వే మజ్దూర్ యూనియన్ డీజిల్ బ్రాంచ్ చైర్మన్ ఎస్.కె.జానీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ జరిగింది. ఈమీటింగ్‌లో చిలుకుస్వామి మాట్లాడుతూ.. డిసెంబర్ 4, 5 తేదీల్లో జరిగే ఎన్నికల్లో జెండా గుర్తుకు ఓటు వేయాలన్నారు. సీసీఎస్ సొసైటీలో మజ్దూర్ యూనియన్ పాలక మండలి ఎనిమిది నెలల్లో రెండు సార్లు డివిడెంట్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. రైల్వే కార్మికుల సమస్యల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం మజ్దూర్ యూనియన్ నిరంతరం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో మజ్దూర్ యూనియన్ డీజిల్ బ్రాంచీ సెక్రటరీ పి.వేదప్రకాశ్, ట్రెజరర్ జి.రాజేశ్వర్‌రావు, అసిస్టెంట్ సెక్రటరీ యాదగిరి, నరేశ్‌యాదవ్, వైస్ చైర్మన్ తిరుపతి, భాస్కర్‌రెడ్డి, వి.యాదగిరి, నాగరాజు, డి.వెంకట్, అశోక్, సంఘీ శ్రీనివాస్, వి.శ్రీనివాస్, చేరాలు, శ్రీధర్, రవీందర్, శంకర్, చంద్రమౌళి, నలినికాంత్, జానీ, సుబానీ, అజిముద్దీన్, అంతయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment