● దాసా అడ్మిషన్లతో ప్రతి ఏటా 90మందికి చోటు ● స్థానిక వి
జీడీపీలో 7.5శాతం
ఐటీ రంగానిదే..
దేశ జీడీపీలో 7.5 శాతం ఐటీ రంగానిదేనని, టెక్నాలజీ రంగంలో అపార ఉద్యోగావకాశాలు ఉన్నాయని కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి అన్నారు.
అయ్యప్ప మాలధారులకు..
శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప మాలధారుల సౌకర్యార్థం కేరళ ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ సంస్థ ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించింది.
వాతావరణం
జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ మామూలుగా ఉంటుంది. రాత్రి చల్లగాలులు వీస్తాయి.
ఆదివారం శ్రీ 17 శ్రీ నవంబర్ శ్రీ 2024
– 8లోu
విదేశీయులం కాదు మేం ఓరుగల్లు స్వదేశీయులం అంటున్నారు.. నిట్ వరంగల్ క్యాంపస్‌లో విద్యనభ్యసిస్తున్న ఫారినర్స్. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన విద్యార్థులను అక్కున చేర్చుకుని నిట్ క్యాంపస్ అమ్మలా ఆదరిస్తోంది. వారి భద్రతకు పెద్దపీట వేస్తోంది. సొంతూరిలో ఉన్న అనుభూతిని కల్పిస్తోంది. ఇక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థులపై ఈ వారం ‘సాక్షి’ సండే స్పెషల్.
– కాజీపేట అర్బన్
సర్వే వేగవంతం చేయాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా
చిల్పూరు: ఇంటింటి సర్వేను మరింత వేగవంతంగా చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మండలంలోని చిన్నపెండ్యాల గ్రామంలో నిర్వహిస్తున్న సర్వేను ఆయన శనివారం ఆకస్మికంగా పరిశీలించారు. సర్వే చేస్తున్న ఎన్యుమరేటర్ రజిత నింపిన ఫామ్స్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోడ్ ప్రకారం తప్పులు లేకుండా సర్వే చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సరస్వతి, ఎంపీడీఓ శంకర్‌నాయక్, క్లస్టర్ ఇన్‌చార్జ్ మధుసూదన్, సూపర్‌వైజర్ సింగపురం కిరణ్‌కుమార్, కార్యదర్శి తౌటి శశికుమార్ తదితరులు పాల్గొన్నారు.
స్టాళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి
జనగామ రూరల్: ఈనెల 19వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్ పర్యటనలో భాగంగా ఆర్ట్స్ కళాశాలలో స్వయం సహాయక సంఘాలచే స్టాళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా సంబంధిత అధికారులకు తెలిపారు. పెంబర్తి హస్తకళ, చేనేత వస్త్ర ప్రదర్శన, జౌళి శాఖ, మహిళలు తయారు చేసిన ఉత్పత్తులపై మొత్తం నాలుగు స్టాళ్లు ఏర్పాటుచేయాలన్నారు.
ఓటరుగా నమోదు చేయించాలి
స్టేషన్‌ఘన్‌పూర్: అర్హులైన ప్రతీ ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించేలా బీఎల్‌ఓలు బాధ్యతగా పనిచేయాలని ఓటరు నమోదు ప్రక్రియ రాష్ట్ర పరిశీలకులు, వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ ఆయూషామస్రత్ ఖానమ్ అన్నారు. ఘన్‌పూర్ డివిజన్‌కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలింగ్‌స్టేషన్‌లను ఆమె శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్‌స్టేషన్‌లను పరిశీలించి బీఎల్‌ఓలతో మాట్లాడారు. 1.1.2025 నాటికి 18 సంవత్సరాలు వయస్సు పూర్తి చేసుకున్న ప్రతీ ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించాలన్నారు. అనంతరం హైస్కూల్‌లో నిర్వహిస్తున్న డిజిటల్ క్లాస్‌లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, ఆర్‌డీఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎన్నికల డీటీ సదానందం, ఆర్‌ఐ రవీందర్, సత్యనారాయణ, అభినయ్, హెచ్‌ఎం సంపత్, పీడీ చంద్రశేఖర్‌రెడ్డి, బీఎల్‌ఓలు రాణి, స్వరూప తదితరులు పాల్గొన్నారు.
జనగామ రూరల్: జనగామ పట్టణంలోని పలు పోలింగ్‌స్టేషన్‌లను ఓటరు నమోదు ప్రక్రియ రాష్ట్ర పరిశీలకులు ఆయూషామస్రత్ ఖానమ్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధి కారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, ఆర్డీఓ గోపిరామ్, తహసీల్దార్ హుస్సేన్, సిబ్బంది పాల్గొన్నారు.
సైన్స్‌తో విజ్ఞానం
పెంపొందించుకోవచ్చు
కొడకండ్ల: సైన్స్‌తో విద్యార్థి విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని, విద్యార్థి దశ నుంచే శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు సైన్స్ ఎగ్జిబిట్లు దోహదపడతాయని జిల్లా విద్యాశాఖాధికారి కె.రాము అన్నారు. శనివారం మండలకేంద్రంలోని టీజీఆర్‌ఎస్ జేసీ గురుకులంలో ప్రిన్సిపాల్ తమ్మి దిలీప్‌కుమార్ అధ్యక్షతన సిరి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో డీఈఓ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు పాఠశాల నుంచే సైన్స్‌పై ఇష్టాన్ని పెంచుకోవాలన్నారు. ప్రఖ్యాత సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు విజయ్, సుధాకర్, ప్రియవేదాంతంలు సైన్స్‌పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రఘునందన్‌రెడ్డి, ఎంఈఓ గ్రేస్‌ఖజీయారాణి, సిరి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు ఇదునూరి శ్రీనివాస్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
జీడికల్ ఆలయ రూపురేఖలు మారుస్తా
లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయ రూపురేఖలు ఏడాదిలోగా మారుస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఈ నెల 20న జరిగే కల్యాణోత్సవ ఏర్పాట్లపై శనివారం ఆలయ ప్రాంగణంలో ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ఆర్డీఓ గోపిరామ్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఎంతో ప్రాశస్త్రం కలిగిన ఆలయాన్ని అందరి సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. రూ.50 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. అంతకు ముందు ఆలయ పరిసరాలను పర్యవేక్షించి అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. మూడు రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్ తెలిపారు. ఈ సమీక్షలో డీపీఓ స్వరూప, ఏసీపీ భీమ్‌శర్మ, ట్రాన్స్‌కో ఎస్‌ఈ వేణుమాధవ్, డాక్టర్ రవితేజ, సీఐ శ్రీనివాసురెడ్డి, పీఆర్ డీఈ రవీందర్, మార్కెట్ వైస్ చైర్మన్ శివకుమార్, గుడి వంశీధర్‌రెడ్డి, మూర్తి, అధికారులు పాల్గొన్నారు.
జిల్లా గ్రంథాలయ చైర్మన్‌గా రాంబాబు
జనగామ: జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్‌గా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం రఘునాథపల్లికి చెందిన మారుజోడు రాంబాబును నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో రాజకీయంలో అంచెలంచెలుగా ఎదుగుతూ, 1999లో జనగామ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2000 సంవత్సరంలో రఘునాథపల్లి టీడీపీ మండల అధ్యక్షుడిగా పని చేసిన ఆయన, 2001లో జెడ్పీటీసీగా గెలుపొంది, ఉమ్మడి వరంగల్ జిల్లా పరిషత్ టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా పని చేశారు. రఘునాథపల్లి బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడిగా ఆయనకు కడియం బాధ్యతలు అప్పగించారు. జిల్లా రైతు సమన్వయ సమితి డైరెక్టర్‌గా పని చేసి, కడియం శ్రీహరి నాయకత్వంలో కావ్యను ఎంపీగా గెలుపించేందుకు కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి, ప్ర భుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మె ల్యే కడియం శ్రీహరి, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూ రి ప్రతాప్‌రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ప్రతి ఒక్కరి సహకారంతో జిల్లా గ్రంథా లయ చైర్మన్‌గా అవకాశం వచ్చిందని, ఇందుకు సహకరించిన ప్రతిఒక్కరికీ రాంబాబు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో జిల్లా గ్రంథాలయ చైర్మ న్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
రేపు ఉద్యోగ నియామక
ఇంటర్వ్యూలు
జనగామ: జిల్లాలో 108, 102 అంబులెన్స్ డ్రైవర్లు (పైలట్), ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ల (ఈఎంటీ) ఉద్యోగ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి నల్ల గొండ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ ఎస్‌కె నసీరొద్దీ న్, జిల్లా మేనేజర్ ఎం.శ్రీనివాస్ తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ పైలట్, ఈఎంటీ ఉద్యోగాలకుఈ నెల 18న (సోమవారం) జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి 108 కార్యాలయంలో ఉదయం 10 గంటల ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలన్నారు. వివరాలకు 800893 5522 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
●
సంతోషంగా
బతుకమ్మ ఆడుతా
మాది ఖతర్. నాకు నిట్ వరంగల్‌కు రావాలంటే మొదట భయం వేసింది. అడ్మిషన్ తీసుకున్నాక స్నేహితులు పెరిగారు. భయం పూర్తిగా తగ్గిపోయింది. మా దగ్గర లేని ఎన్నో పండుగలను నిట్ వరంగల్‌లో జరుపుకుంటాం. నాకు ప్రత్యేకంగా బతుకమ్మ ఆట అంటే చాలా ఇష్టం. ఎంతో ఉత్సాహంగా నేను మా స్నేహితులం బతుకమ్మ ఆడతాం. పండుగలు జరుపుకోవడం అంటే ఆనందం పంచుకోవడమే కాకుండా పరస్పరం ఒకరి గురించి మరొకరం తెలుసుకునే అవకాశం ఉంటుంది.
– గాయత్రి, ఖతర్,
మెకానికల్ సెకండియర్
ఇంటిని తలపించే వాతావరణం
నిట్ వరంగల్ క్యాంపస్ సొంత ఇంటిని తలపించేలా ఉంది. నేను భూటాన్ నుంచి వచ్చినా కూడా.. తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలు అంటే చాలా ఇష్టమయ్యేలా నిట్ వరంగల్ నేర్పించింది. ప్రతీ ఏడాది సంక్రాంతి పండుగకు కై ట్స్ ఎగురవేస్తున్నాం. దసరా, దీపావళి, హోలీ పండుగలను కలర్‌ఫుల్‌గా జరుపుకుంటున్నాం. భూటాన్‌లోని మా సొంత ఊరికి వెళ్లినప్పుడు తెలంగాణ పండుగలను మా వారికి పరిచయం చేస్తున్నా.
– సోనమ్ షెవాంగ్, భూటాన్,
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సెకండియర్
తెలంగాణ ఫుడ్ చాలా ఇష్టం
నేను ఇండోనేషియా నుంచి నిట్ వరంగల్‌లో దాసా ద్వారా అడ్మిషన్ పొందిన తర్వాత ఇక్కడి ఫుడ్‌ను టేస్ట్ చేయడం ప్రారంభించా. నిట్‌లోని హాస్టల్స్‌లో అందించే నార్త్ ఇండియన్‌తోపాటు తెలంగాణ ఫుడ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రత్యేకంగా తెలంగాణ చికెన్, సర్వ పిండి ఎంతో ఇష్టంగా తింటాను. ఇండోనేషియాకు వెళ్లడం కంటే ఇండియాలోనే ఉండిపోవాలని ఉంది.
– ఫర్రాస్ చైదర్, ఇండోనేషియా, మెకానికల్ థర్డ్ ఇయర్
నిట్ చాలా బాగుంది..
నిట్ వరంగల్ క్యాంపస్ చాలా బాగుంది. అధ్యాపకులు, విద్యార్థులు ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. రష్యా కంటే కూడా నిట్ వరంగల్ క్యాంపస్ ఎంతో సేఫ్ అనిపిస్తుంది. తరచూ నగరంలోని భద్రకాళి, వేయిస్తంభాల ఆలయం దర్శిస్తుంటా. నిట్ వరంగల్‌కు దగ్గరలో ఉన్న దాబాలో టేస్టీ ఫుడ్ తినడం చాలా ఇష్టం. ఎంటెక్ కూడా నిట్‌లో చేసేందుకు ప్రయత్నిస్తా. ప్రతీ ఏడాది నిట్‌లో నిర్వహించే టెక్నోజియాన్, స్ప్రింగ్‌స్ప్రీ ప్రోగ్రాంలో తెలుగు విద్యార్థులతో పోటీ పడి పాల్గొంటున్నా.
– సామ్రాట్, రష్యా, సీఎస్‌ఈ ఫోర్త్ ఇయర్
న్యూస్‌రీల్
పరదేశీ విద్యార్థులను అక్కున చేర్చుకుంటున్న వరంగల్ నిట్
నిట్ వరంగల్‌లో విదేశీ విద్యార్థులు చేరేందుకు 2001లో అవకాశం కల్పించారు. ఇందుకు ప్రత్యేకంగా దాసా భవనం ఏర్పాటు చేశారు. కాగా.. ప్రతీ ఏడాది బీటెక్ ప్రథమ సంవత్సరంలోకి 1,300 మంది విద్యార్థులు జేఈఈ ప్రవేశ పరీక్ష ద్వారా జోసా అడ్మిషన్స్‌తో ప్రవేశం పొందుతున్నారు. 1,300 సీట్లలో 90 సీట్లను డైరెక్ట్ అడ్మిషన్ ఆఫ్ స్టూడెంట్స్ అబ్రాడ్(దాసా) పేరిట విదేశీ విద్యార్థులకు ప్రవేశం లభిస్తోంది. ఈ విద్యాసంస్థలో ఇండోనేషియా, రష్యా, ఖతర్, నేపాల్, నైజీరియా తదితర దేశాల విద్యార్థులు చదువుకుంటున్నారు.
అడ్మిషన్ ఫీజు తక్కువే..
విదేశాల్లో రూ.లక్షల్లో అడ్మిషన్ ఫీజులు ఉండగా.. నిట్ వరంగల్‌లో దాసా విద్యార్థులకు 42,500 అడ్మిషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. గల్ఫ్‌లో పనిచేస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలకు దాసా ద్వారా నిట్ వరంగల్‌లో అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. అత్యుత్తమ ఇంజనీరింగ్ విద్యాబోధనతోపాటు క్యాంపస్ సెలక్షన్స్‌కు ప్రత్యేక వేదికగా నిలుస్తున్న నిట్ వరంగల్‌లో చేరేందుకు విదేశీయులు ఆసక్తి కనబరుస్తున్నారు.
భద్రత, స్నేహభావానికి ప్రతీక ఓరుగల్లు
విదేశీయులు తమ సొంత ఊరిలో ఎలా స్వేచ్ఛగా భద్రంగా జీవనం కొనసాగిస్తారో.. అంతకు మించి భద్రతను కల్పిస్తున్నది ఓరుగల్లు నగరం. ఇక్కడ విద్యనభ్యసించేందుకు తమ పిల్లలను పంపించేందుకు విదేశాల్లో ఉన్నవారు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఇక్కడి పండుగల్లో స్థానిక విద్యార్థులతో కలిసి విదేశీయులు పాల్గొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment