గిరిజనుల ఆశాజ్యోతి బిర్సాముండా
జనగామ రూరల్: గిరిజనుల ఆశాజ్యోతి బిర్సాముండా అని అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ అన్నారు. ధర్తి ఆబా భగవాన్ బిర్సా ముండా 150 జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజన గౌరవ దినోత్సవ సమారోహం వేడుకల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ అధికారులుతో కలిసి బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బిర్సా ముండా ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ భాగస్వాములు అయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వినియోగించుకోవాలన్నారు. అనంతరం దర్తి ఆబా జన గ్రామ ఉత్కర్శ్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రాంభించారు. జిల్లాలో జనగామ, నర్మెట, తరిగొప్పుల, చిల్పూరు, పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాలను ఈ పథకం ద్వారా ఎంపిక చేసి ఆయా మండలాల్లో మౌలిక వసతుల కల్పనకు నిధుల మంజూరీకి ప్రతిపాదనలు పంపించాల్సి ఉంటుందన్నారు. అనంతరం విద్యార్థుల నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి ప్రేమకళ, వ్యవసాయ శాఖ అధికారి రామారావు నాయక్, విద్యాశాఖ అధికారి రాము, ఏఓ మన్సూరి, గోపి, వాసు నాయక్, తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్
కలెక్టరేట్‌లో 150వ జయంతి
Comments
Please login to add a commentAdd a comment