లక్ష్యం 10/10
తరగతుల నిర్వహణ ఇలా..
జిల్లావ్యాప్తంగా 103 ఉన్నత పాఠశాలలు, 12 కేజీబీవీలు, 8 మోడల్ స్కూల్స్, 19 గురుకులాలు విద్యాలయాలు ఉండగా.. 6,401 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆయా పాఠశాలల్లో ప్రత్యేక తరగతుల నిర్వహణకు పక్కా ప్రణాళికలను రూపొందించారు. ఈ నెల 1 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు రోజు సాయంత్రం 4:20 నుంచి 5:20 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. జనవరి 1 నుంచి వార్షిక పరీక్షల వరకు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4:20 నుంచి 5:20 గంటల వరకు రెండు పూటలా తరగతులు నిర్వహిస్తారు. అందులో రెగ్యులర్ తరగతులు బోధించకుండా పునశ్ఛరణ, మూల్యంకనంపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా పరీక్షలు నిర్వహించాలి. విద్యార్థులు రాసిన జవాబులను పరిశీలించి, చర్చలతో సరిదిద్దాలి. విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. 2023–24 విద్యా సంవత్సరం పదో తరగతి వార్షిక పరీక్షల్లో శాతం 98.16 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయిలో 4వ స్థానంలో నిలిచింది.
జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక తరగతులు
జనగామ రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో మొదటి స్థానం లక్ష్యంగా పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. గతేడాది 90శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు ఈ సారి వందశాతం వచ్చేలా కృషి చేస్తున్నారు. వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఈ నెల 1 నుంచి జిల్లా పరిషత్ ఉన్నత, మోడల్ స్కూల్స్, కేజీబీవీలోని పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. మొదటి విడతలో 60 రోజుల యాక్షన్ పాన్‌లో సాయంత్రం 4:20 నుంచి 5:20 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఇందులో సకాలంలో సిలబస్ పూర్తి చేసి, రివిజన్ చేయనున్నారు. మొదటి రోజు సాంఘిక శాస్త్రం, రెండో రోజు హిందీ, మూడోరోజు గణితం, నాలుగో రోజు ఆంగ్లం, ఐదో రోజు ఫిజికల్ సైన్స్, ఆరో రోజు సోషల్, ఏడో రోజు బయోలజీ సబ్జెక్టులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు.
జిల్లాలో ఉత్తీర్ణత శాతం వివరాలు
విద్యాసంవత్సరం ఉత్తీర్ణత శాతం
2019–2020 100
2020–2021 100
2021–2022 94.72
2022–2023 96.45
2023–24 98.16
వెనకబడిన విద్యార్థులపై
ఉపాధ్యాయుల ప్రత్యేక దృష్టి
జిల్లాలో 6,401 మంది
టెన్త్ విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment