వేంకటేశ్వరుడి నిజరూప దర్శనం
చిల్పూరు: చిల్పూరుగుట్ట ఆలయంలో కార్తీక మాస గురువారం భక్తులకు నిజరూప దర్శనం ఇచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు రవీందర్‌శర్మ, అర్చకులు రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేద మంత్రాల నడుమ ఆలయ ఈఓ భాగం లక్ష్మిప్రసన్న ఆధ్వర్యంలో భక్తులకు దర్శన రూపం కలిగించారు. జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహన్, వీరన్న, భక్తులు పాల్గొన్నారు.
పారా మెడికల్ డిప్లొమా
కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
జనగామ రూరల్: తెలంగాణ పారా మెడికల్ బోర్డు సెక్రటరీ నోటిఫికేషన్ అనుగుణంగా జనగామ ప్రభుత్వ వైద్య కళాశాలలో 2024–25 విద్యాసంవత్సరానికి డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ కోర్సు (రెండు సంవత్సరాలు), డిప్లొమా ఇన్ ఆప్తాలమిక్ అసిస్టెంట్ కోర్సు (2 సంవత్సరాలు)లకు గాను అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జనగామ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాల్‌రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా కోర్సులకు బైపీసీ, ఎంపీసీ ఉత్తీర్ణత అయిన విద్యార్థులు అర్హులన్నారు. దరఖాస్తులు సమర్పించుటకు ఈనెల 20 చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు కళాశాల వెబ్‌సైట్‌లో సంప్రదించాలన్నారు.
స్టెనో, టైపిస్ట్ పోస్టుకు..
జనగామ రూరల్: జిల్లా కోర్టులో స్టెనో, టైపిస్ట్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. జిల్లా కోర్టులో జనరల్ కేటగిరీలో స్టెనో కం టైపిస్టు పోస్టు ఉన్నట్లు తెలిపారు. డిగ్రీ అర్హతతో పాటు టైప్ రైటింగ్‌లో సర్టిఫికెట్, 34 సంవత్సరాల లోపు వయసు ఉన్న వారు అర్హులన్నారు. ఆసక్తిగల వారు ఈ నెల 20లోపు చైర్మన్, డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యా య సేవా సదన్, జిల్లా కోర్టు, జనగామ చిరునామాకు పోస్టు ద్వారా పంపించాలన్నారు.
నిందితుడిని కఠినంగా
శిక్షించాలి
రఘునాథపల్లి: మండలంలోని ఎల్లారెడ్డిగూడెంలో దళితుడు గంపల పరుశరాములును హత్య చేసిన నిందితుడికి వెంటనే శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించా లని ఎంఎస్పీ రాష్ట్ర నాయకుడు కొయ్యడ మల్లేష్‌మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హత్య చేసిన నిందితుడిపై హత్యానేరం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, పీడీయాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా దళిత సంఘాల నాయకులు డాక్టర్ బొల్లపల్లి కృష్ణ, గిరిమల్ల రాజ, కందుకూరి ప్రభాకర్, రాగల ఉపేందర్, సుంచు రాజు, రవీందర్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
సోమేశ్వరాలయంలో
కార్తీక దీపోత్సవం
పాలకుర్తి టౌన్: సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి ఆలయ కల్యాణ మండపం ఆవరణంలో కార్తీక దీపోత్సవంలో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న మహిళలకు ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు తాంబులం, స్వామి వారి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, అర్చకులు డీవీఆర్ శర్మ, అనిల్‌కుమార్, నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment