దీప ప్రజ్వలనం.. గిరి ప్రదక్షిణం
పాలకుర్తి టౌన్: శబరిమల మకరజ్యోతి మాదిరి క్షీరాద్రి శిఖరమైన పాలకుర్తి శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహాస్వామి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని శుక్రవారం అతిపెద్ద ‘అఖండజ్యోతి’ దర్శనానికి ఏర్పాట్లు చేశారు. పాలకుర్తి క్షీరగిరి చుట్టూ గిరి ప్రదక్షిణ అనంతరం కొండపై ఏర్పాటు చేస్తున్న భారీ ప్రమిదలో టన్ను నూవ్వుల నూనె, ఆవు నెయ్యి, 2 క్వింటాళ్ల ముద్ద కర్పూరంతో అతిపెద్ద అఖండజ్యోతిని ఏర్పాటు చేశారు. పాలకుర్తి శ్రీసో మేశ్వర లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం దక్షిణ భారతదేశంలో మూడో అఖండజ్యోతి నిర్వహస్తుంది. 8 అడుగుల వెడల్పు, 4 అడుగుల ఎత్తులో ప్రత్యేకంగా రూపొందించిన దీపబండాన్ని పాలకుర్తి శిఖరా గ్రవేదికపై ఏర్పాటు చేశారు. వేలాదిగా తరలివచ్చే భక్తుల సమక్షంలో సాయంత్రం 5గంటలకు గిరిప్రదక్షణ అనంతంరం 6:00 గంటలకు అఖండ జ్యోతి ని వెలిగిస్తారు. కాగా, 2013లో క్షీరగిరిపై అఖండ జ్యోతి దర్శనం ఏర్పాటును ప్రారంభించారు.
ముఖ్య అతిఽథులుగా పీఠాధిపతులు,
మంత్రి సురేఖ
శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహాస్వామి దేవస్థానంలో కా ర్తీక పౌర్ణమి సందర్భంగా అఖండ జ్యో తి దర్శనం ప్రారంభానికి ముఖ్యఅతిథి గా ఉత్తరకాశీ పీఠాధి పతులు స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వ తి, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి హాజరు కానున్నారు.
నేడు పాలకుర్తి క్షీరగిరిపై అఖండజ్యోతి
ఏర్పాట్లు పూర్తి..
శబరిమలై మరకరజ్యోతి మాదిరి నేడు(శుక్రవారం) కార్తీక పౌర్ణమి రోజున శ్రీసోమేశ్వర ఆలయంలో నిర్వహించే అఖండజ్యోతి దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశాం. రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. ఆలయం పరిసరాలు విద్యుత్ దీపాలతో అలంకరించాం.
–సల్వాది మోహన్‌బాబు, ఈఓ
Comments
Please login to add a commentAdd a comment