14 పోలింగ్‌ కేంద్రాల మార్పు | Sakshi
Sakshi News home page

14 పోలింగ్‌ కేంద్రాల మార్పు

Published Sat, Apr 20 2024 1:55 AM

కృష్ణకాలనీలో కేంద్రానికి పోలింగ్‌ బూత్‌ నంబర్‌ రాయిస్తున్న రెవెన్యూ అధికారులు  - Sakshi

భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లి నియోజకవర్గంలో పలు పోలింగ్‌ కేంద్రాలను అధికారులు మార్చారు. గతంలో గ్రామాలు, కాలనీలకు దూరంగా ఉన్న పోలింగ్‌ కేంద్రాల్లో మార్పులు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపించగా అనుమతులు రావడంలో నూతన పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో 317 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా.. 14 కేంద్రాలను మార్చినట్లు అధికారులు తెలిపారు. భూపాలపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని 16, 24, 31 పోలింగ్‌ బూత్‌లను సంఘమిత్ర డిగ్రీ కళాశాలకు తరలించారు. పవిత్ర కళాశాలలోని 26, 27, 28 పోలింగ్‌ బూత్‌లను ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు, మైన్‌రెస్క్‌ స్టేషన్‌లోని 33వ బూత్‌ను జంగేడు కేజీబీవీకి, సీఈఆర్‌ క్లబ్‌లోని 35, 36 బూత్‌లను కృష్ణకాలనీ ప్రభుత్వ పాఠఽశాలకు, జంగేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని 54వ బూత్‌ను సెగ్గంపల్లి అంగన్‌వాడీ కేంద్రానికి, చిట్యాల మండలకేంద్రంలోని జెడ్పీఎస్‌ఎస్‌ పాఠశాలలోని 164, 166 బూత్‌లను పక్కనే ఉన్నటువంటి ఉన్నత పాఠశాలకు, గణపురం మండలంలోని కొండాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని 140 బూత్‌ను అప్పయ్యపల్లి ప్రాథమిక పాఠశాలకు, టేకుమట్ల మండలంలోని వెల్లంపల్లి ప్రాథమిక పాఠశాలలోని 96 బూత్‌ను బండపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు మార్చారు. నూతనంగా ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం పోలింగ్‌ కేంద్రాలకు నంబర్లు ఏర్పాటు చేశారు.

ఓటర్లుకు అందుబాటులో కేంద్రాలు

Advertisement
Advertisement