సేవాలోపం ఉంటే చర్యలు తీసుకుంటాం
వైద్యంలో నిర్లక్ష్యం కారణంగా రోగి మృతి చెందినట్లు ఫిర్యాదు చేస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. కొన్ని ఆసుపత్రుల్లో అధికంగా బిల్లులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. విచారణ చేస్తున్నాం. ఆసుపత్రుల్లో ఎటువంటి సేవాలోపం ఉన్నా మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం. ఇటీవల జిల్లాలో జరిగిన సంఘటనలపై విచారణ చేస్తున్నాం. కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తాం.
– వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి, రాజమహేంద్రవరం
దాడులు చేయడం నేరం
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రోగి మృతి చెందినట్లు భావిస్తే బాధితులు సంబంధిత పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. దీనిపై సంబంధిత వైద్యాధికారులతో దర్యాప్తు చేయిస్తాం. నేరం నిరూపణ అయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారికి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా తగు చర్యలు తీసుకుంటారు. ఆసుపత్రులపై దాడు లు చేయడం నేరం. అలా దాడులకు దిగిన రోగి బంధువులపై చర్యలు తీసుకుంటాం.
– డి.నరసింహ కిశోర్, జిల్లా ఎస్పీ
ఆందోళనకు దిగడం మంచిది కాదు
ఏ ఆసుపత్రిలోనూ అనవసరంగా వైద్య పరీక్షలు చేయరు. రోగి కోలుకోవాలన్న లక్ష్యంతో వైద్యులు చికిత్స అందిస్తారు. ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తారు కానీ ప్రాణం పోయలేరు కదా! రోగులు కూడా తమ స్తోమతకు మించి పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేర్చి, బిల్లుల విషయంలో ఆందోళనకు దిగడం మంచిది కాదు. దీనివల్ల వైద్యులు అభద్రతా భావానికి గురై, సేవాలోపం జరిగే ప్రమాదం ఉంటుంది.
– డాక్టర్ గురుప్రసాద్, ఐఎంఏ అధ్యక్షుడు, రాజమహేంద్రవరం
●
Comments
Please login to add a commentAdd a comment