కాకినాడ సిటీ: బాల్య వివాహ ముక్తభారత్ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో జేసీ రాహుల్ మీనా, డీఆర్‌ఓ జె.వెంకటరావు, ఐసీడీఎస్ పీడీ కె.ప్రవీణ తదితరులతో కలిసి జిల్లా అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ కార్యక్రమం వచ్చే నెల 10వ తేదీ వరకూ జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా బాల్య వివాహాల నిర్మూలన, బాలల విద్య వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. లింగ వివక్షకు గురవుతున్న మహిళలకు, చిన్న పిల్లలకు, యువతీ యువకులకు ఆయా చట్టాలపై అవగాహన పెంపొందించాలని సూచించారు. జెండర్ ఆధారిత హింసకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే అంశంపై వాల్‌పోస్టర్‌ను డీఆర్‌డీఏ అధికారులతో కలసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ ప్రత్యేక కార్యక్రమం వచ్చే నెల 23వ తేదీ వరకూ జరుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment