నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్న కేటీఆర్
కామారెడ్డి: ఎన్నికలలో గెలుపు, ఓటములు సహజమని, ఓటమినుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కార్యకర్తలు అధైర్యపడవద్దని, అండగా తానుంటానని పేర్కొన్నారు. పొరపాట్లు ఎక్కడ జరిగాయో గుర్తించి వాటిని సరిచేసుకోవాలని, ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు పార్టీ నేతలతో మాట్లాడారు. గ్రామాలు, మండలాలవారీగా బీఆర్‌ఎస్‌కు వచ్చిన ఓట్ల వివరాలు తెలుసుకున్నారు. ఆయా నియోజకవర్గాలలో ఓటమికి గల కారణాలను తెలుసుకున్నట్లు సమాచారం. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎంకే ముజీబొద్దీన్, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు ప్రశాంత్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ దఫేదార్ శోభ, కామారెడ్డి బల్దియా చైర్‌పర్సన్ నిట్టు జాహ్నవి, మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, హన్మంత్ సింధే, సురేందర్, నాయకులు నిట్టు వేణుగోపాల్‌రావు, ఎంజీ వేణుగోపాల్‌గౌడ్, బల్వంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఇవి చదవండి: పంచాయతీ పోరుకు బ్రేక్..! పార్లమెంట్ ఎన్నికల తర్వాతే..
Comments
Please login to add a commentAdd a comment