ఎయిర్‌ఫోర్స్‌ క్యాప్స్‌ అందజేత | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ఫోర్స్‌ క్యాప్స్‌ అందజేత

Published Tue, Apr 23 2024 8:15 AM

- - Sakshi

కామారెడ్డి అర్బన్‌ : విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించడానికి క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమైందని ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు సందీప్‌, అనిల్‌ అన్నారు. కామారెడ్డి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల, ఆర్కే డిగ్రీ కళాశాలలో సోమవారం ఎయిర్‌ ఫోర్స్‌, అగ్నివీర్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న ఎయిర్స్‌ ఫోర్స్‌ అధికారులు నాలం సందీప్‌, అనిల్‌ గోస్వామిలు ఎయిర్‌ ఫోర్స్‌ క్యాప్‌, బ్రోచర్‌ను అందజేసి అవగాహన కల్పించారు. ఆర్మీ,నేవీ,ఎయిర్‌ ఫోర్స్‌ రంగాల్లో ఉద్యోగాలు పొందేందుకు ప్రాథమికంగా ఎన్‌సీసీ విద్యార్థులకు అదనపు అర్హతగా కలిసివస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ కే.విజయ్‌కుమార్‌, క్రీడలు, యువజన జిల్లా అధికారి వై.దామోదర్‌రెడ్డి, ఎన్‌సీసీ అధికారి లెఫ్టినెంట్‌ ఎం రామస్వామి, సమన్వయకర్త ఎం చంద్రకాంత్‌, అధ్యాపకులు అనిల్‌కుమార్‌, చంద్రశేఖర్‌, ఆర్కే సీఈవో జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీఎంకు స్వాగతం

పలికిన చైర్‌పర్సన్‌

కామారెడ్డి టౌన్‌ : నిజామాబాద్‌లో సోమవా రం జరిగిన కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డిని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇందుప్రియ సభలో సీఎంను శాలువాతో సత్కరించారు. కామారెడ్డి జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మహమ్మద్‌ ఇలియాస్‌ స్వాగతం పలికా రు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకోవాలి

కామారెడ్డి టౌన్‌ : దివ్యాంగులు ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞా న్‌ వికలాంగుల సేవా సమితి వ్యవస్థాపకుడు చిప్ప దుర్గాప్రసాద్‌ కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వచ్చే నెల 13వ తేదీన జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా కేంద్ర ఎన్నికల కమిషన్‌ దివ్యాంగుల కోసం ఉచిత రవాణా సౌకర్యం కల్పించిందన్నారు.

270 సెల్‌ఫోన్ల రికవరీ

బాన్సువాడ : బాన్సువాడ పోలీస్టేషన్‌ పరిధిలో బాధితులు పోగొట్టుకున్న సెల్‌ఫోన్లను రికవరీ చేసినట్లు సీఐ కృష్ణ తెలిపారు. పోలీస్టేషన్‌ పరిధిలో ఇప్పటివరకు 600 పైగా సెల్‌ఫోన్లు పోయినట్లు బాధితులు ఫిర్యాదు చేశారని, అందులో ఇప్పటి వరకు 270 సెల్‌ఫోన్లను రికవరీ చేశామని ఆయన అన్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు యాప్‌ ద్వారా చోరీకి గురైన ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. సెల్‌ఫోన్ల రికవరీకి కృషి చేసిన సీఈఐఆర్‌ ఆపరేటర్‌ రాజేష్‌ను సీఐ అభినందించారు.

1/2

2/2

Advertisement
Advertisement