బాన్సువాడ : పట్టణంలోని ఈనెల 11వ తేదీన అర్ధరాత్రి జరిగిన వాచ్‌మెన్ వెంకట్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. సీఐ అశోక్ కేసుకు సంబంధించిన వివరాలు గురువారం వెల్లడించారు. పాత బాన్సువాడకు చెందిన వెంకట్ అనే వ్యక్తి సరస్వతి మందిరం సమీపం నిర్మాణంలో ఉన్న భవనం వద్ద వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. మరో వాచ్‌మెన్ పోల్కం వీరయ్య వద్ద వెంకట్ చేబదులుగా రూ.25వేలు తీసుకున్నాడు. తీసుకున్న డబ్బులు తిరిగివ్వాలని వీరయ్య పలుమార్లు వెంకట్‌ను కోరినప్పటికీ అతడు ఇవ్వకపోవడంతో 11వ తేదీ అర్ధరాత్రి నిర్మాణంలో ఉన్న భవనంలో నిద్రిస్తున్న వెంకట్‌పై వీరయ్య గొడ్డలితో దాడి చేశాడు. గొంతు, తలు, ఎడచేయిపై నరకడంతో వెంకట్ అక్కడికక్కడే మృతి చెందాడు. 12వ తేదీన ఉదయం ఏమీ తెలియని వాడిలా వెంకట్‌ను ఎవరో చంపేశారని ఇంటి యజమానికి, చుట్టు పక్కల వారికి చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడు. పోలీసులు వీరయ్యను విచారించగా, తన వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో హత్య చేశానని అంగీకరించాడు. వీరయ్యను రిమాండ్‌కు తరలించామని సీఐ తెలిపారు. హత్య కేసును ఛేదించిన హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్, సిబ్బంది అశోక్, హేమాంద్రిని సీఐ అభినందించారు.
బాన్సువాడలో వృద్ధుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment