ట్రాన్స్ఫార్మర్ బిగింపు
సాక్షి కి కృతజ్ఞతలు తెలిపిన రైతు
భిక్కనూరు: రైతు పొలంలో ఎట్టకేలకు ట్రాన్స్ఫార్మర్ బిగించారు. దీంతో రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. గతేడాది జనవరి 15న భిక్కనూరు శివారులోని పొలంలోగల ట్రాన్స్ఫార్మర్ను దొంగలు పగులగొట్టి కాపర్ కాయిల్స్ ఎత్తుకెళ్లారు. రామేశ్వర్పల్లికి చెందిన రైతు పెద్దోళ్ల శరత్ ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు కోరినా స్పందన లేకపోవడంతో గురువారం డిప్యూటీ సీఎంకు ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు చేశాడు. రైతు సమస్యపై ‘సాక్షి’లో శుక్రవారం వార్త ప్రచురితమైంది. దీనిపై ట్రాన్స్‌కో ఎస్ఈ శ్రావణ్‌కుమార్ స్పందించారు. వెంటనే నూతన ట్రాన్స్ఫార్మర్ బిగింపజేశారు. ఈ సందర్భంగా ట్రాన్స్‌కో ఎస్ఈ ‘సాక్షి’తో మాట్లాడుతూ తాను ఇటీవలే బదిలీపై జిల్లాకు వచ్చానన్నారు. రైతు సమస్య తనకు తెలియదన్నారు. ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తను చూసి స్పందించి, ట్రాన్స్ఫార్మర్ బిగింపజేశానన్నారు. రైతులకు ఏ సమస్య ఉన్నా స్థానిక విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ‘సాక్షి’లో వార్త ప్రచురితం కావడం వల్లే తన సమస్య పరిష్కారమైందని రైతు పెద్దోళ్ల శరత్ ఆనందం వ్యక్తం చేశారు. ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో డీఈ కల్యాణ్ చక్రవర్తి, ఏడీఈ సుదర్శన్‌రెడ్డి, ఏఈ సంకీర్త్, లైన్‌మన్ మాణిక్యం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment