‘ఆన్లైన్ ఎంట్రీని వేగవంతం చేయాలి’
లింగంపేట: ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో వేగంగా నమోదు చేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన లింగంపేటలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు. సకాలంలో డబ్బులు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. సీ రియల్ ప్రకారం ధాన్యం తూకం వేయడం లేదని రైతులు అదనపు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో ఆయన సీరియల్ ప్రకారం తూకం వేయాలని నిర్వాహకులకు సూచించారు. ట్యాబ్ ఎంట్రీలో లింగంపేట వెనకబడి ఉందని పేర్కొన్నా రు. ధాన్యం కొనుగోళ్ల వివరాలను వెంటవెంటనే నమోదు చేయాలని సీఈవో పెంటయ్యకు సూచించారు. రైస్మిల్ల ర్లు ధాన్యం బస్తాలను త్వరగా అన్లోడ్ చేసుకునేలా చూ డాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ నరేందర్‌గౌడ్, రైతులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment