ఎప్‌సెట్‌ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి | Sakshi
Sakshi News home page

ఎప్‌సెట్‌ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి

Published Sat, Apr 20 2024 1:45 AM

రోడ్డుపై పడిన ధాన్యం - Sakshi

స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ బట్టు మల్లయ్య

కరీంనగర్‌: నగరంలోని సప్తగిరికాలనీ కేజీబీ వీలో నిర్వహిస్తున్న ఎప్‌సెట్‌ ప్రత్యేక శిక్షణ తరగతులను స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ బట్టు మల్లయ్య శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. వేసవి సెలవుల్లో నిర్వహిస్తున్న ఎప్‌సెట్‌ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సబ్జెక్టులకు సంబంధించిన అనుమానాలను శిక్షకులను అడిగి, నివృత్తి చేసుకుంటూ, కష్టపడి చదివి మంచి ర్యాంకులు సాధించాలన్నారు. కేజీవీబీల్లో చదివేవారు చాలా పేదరికం నుంచి వస్తారని, వారికి ఇబ్బందులు కలగకుండా మన సొంత పిల్లల్లా చూసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో డీఈవో జనార్దన్‌రావు, జిల్లా జెండర్‌ అండ్‌ ఈక్విటీ కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ డెబోరా కృపారాణి, కేజీబీవీ ప్రత్యేక అధికారి పుష్పరాణి తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం ట్రాక్టర్‌ను

ఢీకొన్న లారీ

సుల్తానాబాద్‌రూరల్‌: కాట్నపల్లి గ్రామ శివారులోని రాజీవ్‌ రహదారిపై ధాన్యం లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓ లారీ వెనుక నుంచి ఢీకొంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గర్రెపల్లిలోని ఐకేపీ కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం లోడ్‌తో ట్రాక్టర్‌ సుల్తానాబాద్‌కు వస్తోంది. ఈక్రమంలో కరీంనగర్‌ నుంచి పెద్దపల్లి వైపు వెళ్తున్న లారీ వెనుక నుంచి ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది. దీంతో ట్రాక్టర్‌ బోల్తాపడగా డ్రైవర్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే, అందులో ధాన్యం రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయింది. దాదాపు గంటకుపైగానే వాహనాలు నిలిచి ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

వేంకటేశ్వరస్వామి ఫొటోలు ధ్వంసం

జగదేవుపేట ఆలయంలో దుండగుల దుశ్చర్య

వెల్గటూర్‌(ధర్మపురి): మండలంలోని జగదేవుపేట శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో దుండగులు ప్రవేశించి, స్వామివారి ఫొటోలు, పూజా సామగ్రి ధ్వంసం చేశారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి వెళ్లి, స్వామివారి ఫొటోలు, కలశం, ఆలయ ప్రాంగణంలోని తులసి గద్దెను పక్కనున్న కాలువలో, పంట పొలాల్లో పడేశారు. ఈ ఘటనపై ఆలయ కమిటీవారు, దీక్షాస్వాములు శుక్రవారం ఉదయం వెల్గటూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై ఉమాసాగర్‌ ఆలయాన్ని సందర్శించి, వివరాలు సేకరించారు. గ్రామానికి చెందిన కొందరు అన్యమతస్తులే ఇలా చేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

మాట్లాడుతున్న డైరెక్టర్‌ మల్లయ్య
1/2

మాట్లాడుతున్న డైరెక్టర్‌ మల్లయ్య

పంట పొలాల్లో స్వామివారి ఫొటో
2/2

పంట పొలాల్లో స్వామివారి ఫొటో

 
Advertisement
 
Advertisement