బిల్లులు ఇప్పిస్తారా.. చావమంటారా?
● క్రిమిసంహారక మందు డబ్బాతో కాంట్రాక్టర్ నిరసన
గంభీరావుపేట(సిరిసిల్ల): చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు ఇప్పిస్తారా.. చావమంటారా అంటూ ఓ కాంట్రాక్టర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగాడు. బాధితుడి వివరాల ప్రకారం.. గంభీరావుపేట మండలంలోని కోళ్లమద్దికి చెందిన కాంట్రాక్టర్ ఏనుగు కేశవరావు గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీలో షాపింగ్ కాంప్లెక్స్, పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాడు. వాటికి సంబంధించిన బిల్లులు దాదాపు రూ.13 లక్షలు రావాల్సి ఉంది. ఈ క్రమంలో సోమవారం క్రిమిసంహారక మందు డబ్బాతో గ్రామపంచాయతీ కార్యాలయానికి చేరుకొని, బైఠాయించాడు. తాను పనులు చేసి, నెలలు గడుస్తోందని, పంచాయతీకి నిధులు వస్తున్నా తనకు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చశాడు. జిల్లా ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయాడు. ఎస్సై శ్రీకాంత్ అక్కడికి చేరుకొని, బిల్లుల చెల్లింపు విషయమై అధికారులతో మాట్లాడుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించాడు.
Comments
Please login to add a commentAdd a comment