రామగుండం రైల్వేస్టేషన్‌లో తనిఖీలు
రామగుండం: స్థానిక రైల్వేస్టేషన్ సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఎటుచూసినా పోలీ సులతో కనిపించింది. ఏం జరుగుతోందనని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే పలు సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఏసీపీ రమేశ్ ఆధ్వర్యంలో వివిధ ఠాణాల పోలీసు సిబ్బంది, బాంబు డిస్పోజల్, బ్లూకోల్ట్స్, డాగ్ స్క్వాడ్, రైల్వే పోలీసులు తనిఖీలు చేశారు. దాణాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు జనరల్ బోగీల్లో కిక్కిరిసి ఉన్న ప్రయాణికులను కిందకు దింపారు. వారి బ్యాగులను పరిశీలించారు. అనుమానితులతో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆటోడ్రైవర్లకు పలు సూచనలు చేశారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం డ్రగ్స్ రహిత రాష్ట్రానికి చర్యలు తీసుకుంటోందని, సీపీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించామని ఏసీపీ తెలిపా రు. రామగుండం, గోదావరిఖని సీఐలు ప్రవీణ్‌కుమార్, ఇంద్రసేనారెడ్డి, రామగుండం, అంతర్గాం ఎస్సైలు సంధ్యారాణి, వెంకటస్వామి, రైల్వే సీఐ సురేశ్‌గౌడ్, జీఆర్పీ ఇన్‌చార్జి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment