‘రాజ్యాంగాన్ని రక్షిస్తేనే హక్కులకు రక్షణ’
జగిత్యాలరూరల్: రాజ్యాంగాన్ని రక్షిస్తేనే హక్కులకు రక్షణ ఉంటుందని కేంద్ర సమాచార మాజీ కమిషనర్, విద్యావేత్త మాడభూషి శ్రీధర్ అన్నారు. మంగళవారం జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్ శివారులోని ఓ ఫంక్షన్‌హాల్‌లో అంతర్జాతీయ మాన వ హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హక్కులు అడిగితే వస్తాయి తప్ప మౌనంగా ఉంటే రావని తెలిపారు. కార్యక్రమంలో మానవ హక్కుల సమితి జిల్లా అధ్యక్షుడు లత గంగారాం, జాతీయ అధ్యక్షుడు అయిల్నేని శ్రీధర్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరమల్ల సందీప్, కార్యదర్శి నాగరాజు, నాయకుడు చుక్క గంగారెడ్డి, జగిత్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, న్యాయవాది భాస్కర్‌రెడ్డి, సంస్థ సెర్ప్ ఏవో శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment