పల్లకీలో అమ్మవారి ఊరేగింపు వేడుక
● వైభవంగా అమ్మవారి ఉత్సవాలు
మైసూరు: నాడిన శక్తిదేవత మైసూరు చాముండికొండపైన వెలసిన చాముండేశ్వరి అమ్మవారికి సోమవారం పుట్టిన రోజు వేడుకలను వేలాది మంది భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. శ్వేత రంగు చీర అలంకరణలో అమ్మవారిని బంగారు పల్లకీ పైన కూర్చుండబెట్టి చాముండి కొండ పైన ప్రముఖ వీధుల్లో ఊరేగించారు. రాజవంశీకులు యదువీర్, ఆయన భార్య త్రిషికాసింగ్, రాజమాత ప్రమోదాదేవి ఒడెయార్, దేవాదాయ శాఖ మంత్రి రామలింగా రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు అర్చకులు తెల్లవారుజామున 3.30 గంటలకు గర్భగుడిలో విశేష పూజలు చేశారు. ఆలయం లోపల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలిరావడంతో చాముండిగిరులు కిక్కిరిశాయి.
Comments
Please login to add a commentAdd a comment