మైసూరు: నగరంలో ముడా ఇళ్ల స్థలాల స్కాంలోరాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల క్రితం న్యాయ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి పీఎన్ దేశాయి ఏకసభ్య కమిషన్ మంగళవారం ముడా ఆఫీసుకు వచ్చారు. వారికి ముడా అధ్యక్షుడు, జిల్లాధికారి లక్ష్మికాంతరెడ్డి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. తరువాత దేశాయి ముడా అధికారులతో సమావేశం నిర్వహించి కేసు విచారణ జరిపి దాఖలాలను సేకరించారు. ఆరు నెలల్లోగా కమిషన్ నివేదికను ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. ఇప్పటికే లోకాయుక్త, ఈడీ కూడా విచారణ సాగిస్తున్నాయి. వరుస దర్యాప్తులతో ముడా అధికారులు, దళారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఒక్కొక్కరికి 20, 30 స్థలాలు
ముడా నుంచి 50:50 నిష్పత్తిలో కేటాయించిన స్థలాల రెండో జాబితా బయటకొచ్చింది. అందులో 928 స్థలాల సమాచారం ఉంది. ఈ జాబితాలో సీఎం సిద్దరామయ్య భార్య పార్వతి, సీఎం ఆప్తుడు హినకల్ పాపణ్ణ పేరు కూడా ఉంది. పార్వతికి కేటాయించిన 14 స్థలాల వివరాలు ఉన్నాయి. హినకల్ పాపణ్ణకు 32 స్థలాలు దక్కాయి. మహదేవ్ అనే వ్యక్తికి 34, దీపు రాజేంద్రకు 14, మహేంద్రకు 19, అబ్దుల్ వాహిద్‌కు 14, ఎం.రవికుమార్‌కు 23, సునీతాబాయికి 12, క్యాథెడ్రల్ ప్యారిస్ సొసైటీకి 48 స్థలాలు లభించాయి.
మైసూరుకు రిటైర్డు జడ్జిదేశాయి రాక
Comments
Please login to add a commentAdd a comment