అభివృద్ధికి నిధులు ఇస్తున్నాం: సీఎం
మైసూరు: ఐదు గ్యారంటీ పథకాలకు ఏటా రూ.58 వేల కోట్లు ఖర్చు చేస్తున్నా, అభివృద్ధి పథకాలకు కూడా నిధులను అందిస్తున్నామని సీఎం సిద్దరామయ్య అన్నారు. ఆయన మంగళవారం జిల్లాలోని హెచ్డీ కోటె పట్టణంలోని జూనియర్ కాలేజీలో మహర్షి వాల్మీకి జయంతి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ఉచిత బస్సు పథకం కింద మహిళలు 324 కోట్ల సార్లు బస్సుల్లో ప్రయాణించారన్నారు. 1.64 కోట్ల కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ను, 1.22 కోట్ల మంది మహిళలకు నెలకు రూ.2000 చొప్పున గృహ లక్ష్మిని అందిస్తున్నామన్నారు. యువ నిధి పథకం కింద డిగ్రీ చేసిన వారికి రూ.3 వేలు, డిప్లొమా చేసిన వారికి రూ.1500 అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సునీల్ బోస్, ఎమ్మెల్సీ యతీంద్ర, ప్రసన్నానందస్వామి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎంకు ఖడ్గాన్ని బహూకరించి సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment