పావగడ: భార్య ప్రవర్తన నచ్చక విరక్తితో చంద్రశేఖర్ (28) అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పావగడ తాలూకా లోని గుమ్మఘట్ట గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడరహళ్లికి చెందిన చంద్రశేఖర్‌కు గుమ్మఘట్టకు చెందిన షర్మిలతో పెళ్లయింది. వీరికి ఏడాది కుమారుడున్నాడు. భార్య చెప్పాపెట్టకుండా పుట్టింటికి పదే పదే వెళ్లడంతో ఇది మంచి పద్ధతి కాదని పలుసార్లు హెచ్చరించాడు.
అయినా భర్త మాట వినకుండా ఆమె నిర్లక్ష్యంగా వ్యవహరించేది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని సోమందేపల్లిలోని క్యాతగానచెర్లు గ్రామానికి వెళ్లిపోయింది. భర్త ఆ గ్రామానికి వెళ్లి విచారించగా అక్కడ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెల్సింది. ఈ పరిణామాలతో బాధపడి మంగళవారం రాత్రి ఇంట్లో తన భార్య చీరతో ఫ్యానుకు ఉరివేసుకుని తనువు చాలించాడు. మృతుడి తండ్రి రామాంజినప్ప ఫిర్యాదు మేరకు భార్య, ఆమె సోదరిపై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment