కాల్చివేసిన మహిళ మృతదేహం గుర్తింపు | Sakshi
Sakshi News home page

కాల్చివేసిన మహిళ మృతదేహం గుర్తింపు

Published Mon, May 6 2024 5:30 AM

కాల్చివేసిన మహిళ మృతదేహం గుర్తింపు

దొడ్డబళ్లాపురం: కాలిన స్థితిలో మూడు రోజుల క్రితం వెలుగు చూసిన మహిళ మృతదేహం ఆచూకీ లభించింది. ఆమెను గార్మెంట్స్‌ ఫ్యాక్టరీ ఉద్యోగిణి వీణగా గుర్తించిన పోలీసులు..ఆమెను భర్తనే హత్య చేసినట్లు నిర్ధారించారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. వివరాలు.. దొడ్డ బళ్లాపురం పట్టణ పరిధిలోని కరేనహళ్లిలో రవిచంద్ర, వీణా(19) దంపతులు నివాసం ఉంటన్నారు. వీరిద్దరూ రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీణా గార్మెంట్స్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. రవిచంద్ర పక్కింటి మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసి వీణ గొడవపడింది. అక్రమ సంబంధానికి వీణ అడ్డుగా ఉందని భావించి ఆమెను అంతం చేయాలని రవిచంద్ర పథకం రచించాడు. గత నెల 22న వీణాను ఫ్యాక్టరీ నుంచి బైక్‌పై ఎక్కించుకుని నారసింగనహళ్లి సమీపంలోని నిర్జనప్రదేశానికి తీసికెళ్లి హత్య చేసి శవాన్ని నిప్పంటించి కాల్చివేశాడు. అనంతరం ఏమీ ఎరగనట్టు భార్య ఇంటికి రాలేదని నాటకమాడి అదేనెల 25న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మూడు రోజుల క్రితం నారసింగనహళ్లి సమీపంలో కాలిన మృతదేహం ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు వెళ్లి పరిశీలించారు. మిస్సింగ్‌ కేసు నమోదైన వీణాకు సంబంధించి ఆమె బంధువులను తీసుకెళ్లి చూపించారు. మృతురాలు వీణగా గుర్తించారు. అనంతరం పోలీసులు రవిచంద్రను అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగు చూసింది. దీంతో అతన్ని అరెస్ట్‌ చేశారు.

పక్కింటి మహిళ ఆత్మహత్య

రవి అక్రమ సంబంధం పెట్టుకున్న పక్కింటిలోని కల్పన ఆత్మహత్య చేసుకుంది. రవి అరెస్ట్‌ అయినట్లు తెలియగానే ఆమె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రవి అకృత్యాలకు అటు భార్య, ఇటు ప్రియురాలు మృతి చెందడం సంచలనంగా మారింది. రవి, వీణ దంపతులకు ఒక కుమార్తె, కల్పనకు ఒక కుమార్తె ఉన్నారు.

భర్తనే హత్య చేసినట్లు పోలీసుల నిర్ధారణ

వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు ఘాతుకం

నిందితుడి అరెస్ట్‌

Advertisement
 
Advertisement